బెట్టింగ్‌ల జోరు
ABN, First Publish Date - 2023-04-02T00:11:56+05:30
ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ మొదలైందంటే క్రీడాభి మానులకు పండగే. అంతకంటేమించి బెట్టింగ్ రాయుళ్లకు క్షణం ఖాళీ ఉండదు.
కోట్లలో పందేలు
వలలో చిక్కుకుంటున్న యువత
రోడ్డున పడుతున్న కుటుంబాలు
చర్యలు తప్పవంటున్న పోలీసులు
భీమవరం క్రైమ్, ఏప్రిల్ 1 : ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ మొదలైందంటే క్రీడాభి మానులకు పండగే. అంతకంటేమించి బెట్టింగ్ రాయుళ్లకు క్షణం ఖాళీ ఉండదు. గత నెల 31వ తేదీ నుంచి మొదలైన ఈ మ్యాచ్‌లకు యువత టీవీలకు అతుక్కుపోతోంది. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన బెట్టింగ్ ఇప్పుడు పశ్చిమకూ పాకింది. ఏటా మ్యాచ్‌లు జరుగుతుండటం తో యువత పందేలకు అలవాటుపడ్డారు. జిల్లాలోని భీమవరంతోపాటు నర్సాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకి వీడు వంటి పట్టణాల్లో ఈ పందేలు ఎక్కు వగా జరుగుతున్నాయి. ఇక పందేల్లో వేలు, లక్షలు దాటిపోయి కోట్లలో టర్నోవర్ జరుగుతోంది. వీటిల్లో చిక్కుకుని యువత జేబులు గుల్ల చేసు కుంటున్నారు. కొందరు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. దీనిపై పోలీసులు నిఘా పెడుతున్నా.. చాటు మాటుగా వీటిని నిర్వహిస్తున్నారు. గతంలో క్రికెట్ పందేలకు బుకీలు మధ్యలో ఉండి ఆడించేవారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లో కొన్ని యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఇవి ఆన్‌లైన్‌లోనే జరుగుతు న్నాయి. కోట్లలో కష్టాలు పాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల కాలంలో పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, మేజర్ గ్రామాల్లోనూ వీటిని నిర్వహిస్తు న్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో భీమవరం పట్టణం రెస్ట్‌హౌస్ రోడ్డుకు చెందిన ఓ వ్యక్తి భీమవరం, తణుకు వంటి పట్టణాల్లో పోలీసులకు పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. సీజన్‌కు ముందే బెట్టింగ్ నిర్వహించే బుకీలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వడం పరిపాటి. డిజిటల్ యుగంలో బుకీలు తగ్గిపోతు న్నారు. మొబైల్ ఫోన్‌లే బుకీలుగా మారుతున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్స్‌తో చడీచప్పుడు లేకుండా బెట్టింగ్‌లు సాగిపోతున్నాయి. బుకీలు యాప్‌లు తయారు చేయించి ఆడించడం ఒక వంతు అయితే, ఇంటర్నేషల్ యాప్స్‌లో సైతం నేరుగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాయి.
బుకీల రాకతో
ఒకప్పుడు బెట్టింగ్ వేయాలంటే తమకు తెలిసిన వారితో పందెం కుదుర్చుకునే వారు. బెట్టింగ్ వేసిన ఇద్దరు వ్యక్తులు మధ్యవర్తి వద్ద పందెం సొమ్ముల ను కలుపుకునేవారు. మ్యాచ్ అయిన తర్వా త గెలిచిన వారికి సొమ్ములు ఇచ్చేవాడు. ఇలా మధ్యవర్తి వ్యవస్థ పెరుగుతూ బుకీలు తెరపైకి వచ్చారు. వారు నేరుగా ఇంటర్నేష నల్ సర్వర్‌ల ద్వారా బంతి బంతికి ఒక్కో ధర నిర్ణయించి బెట్టింగ్ రాయుళ్లకు ఫోన్ లలో అందుబాటులో ఉండేవారు. ఒక టోర్న మెంట్ ప్రారంభమవుతుందంటే నెల ముం దు నుంచే బుకీలు నిర్వహించేవారు. సమీప గ్రామాలు, పట్టణాల్లో పందెం రాయుళ్లను సంప్రదించి అడ్వాన్స్ సొమ్ములు తీసుకుని కట్టిన అడ్వాన్స్‌లను బట్టి పందెం ఆడనిచ్చే వారు. పోలీసులు ఏదో రోజు పట్టుకోవడం వాటి గుట్టు రట్టు చేయడం వంటి వాటితో కొంత భయపడేవారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో బెట్టింగ్ యాప్‌లు హవా నడు స్తోంది. వేరే వ్యక్తితో సంబంధం లేకుండానే నేరుగా బెట్టింగ్ కాసుకునే వెసులుబాటు ఉండటంతో యువతంతా ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లపై పడ్డారు.
Updated Date - 2023-04-02T00:11:56+05:30 IST