మాతృభాషతోనే మానవ మనుగడ
ABN, First Publish Date - 2023-02-21T23:33:46+05:30
మాతృభాషకు తొలి బడి తల్లి ఒడి అని, మాతృభాష లేనిదే మానవజాతి మనుగడ లేదని వైఎంహెచ్‌ఎ ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ అన్నారు.
ఏలూరు కల్చరల్, ఫిబ్రవరి 21: మాతృభాషకు తొలి బడి తల్లి ఒడి అని, మాతృభాష లేనిదే మానవజాతి మనుగడ లేదని వైఎంహెచ్‌ఎ ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సం దర్భంగా మంగళవారం తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ప్రతి ఒక్కరు మాతృభాషను ప్రేమించాలన్నారు. ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు, ఎల్.వెంకటేశ్వరరావు, గుడిపాటి లలితా శర్మ, వై.సోమలింగే శ్వరరావు, మోతే శ్రీనివాసనారాయణరావు, డి.హేమసుందర్ ప్రసంగించారు.
శనివారపుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం సర్వేశ్వరరావు అధ్యక్ష తన మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. మాతృభాష గొప్పతనాన్ని విద్యా ర్థులకు వివరించారు. విద్యార్థులు జానపద నృత్యాలు, కోలాటం, శాస్త్రీయ నృత్యం, శివతాండవం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యా యులు రాజేశ్వరి, రాజ్‌కుమార్, లోకేశ్వరి, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు టూటౌన్: మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలని ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం సభ్యురాలు పి.కస్తూరిబాయి అన్నారు. కేపీడీటీ హై స్కూల్‌లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించారు. విజ్ఞాన కేం ద్రం సభ్యులు ఆదిశేషు తెలుగు భాష ప్రాముఖ్యాన్ని వివరించారు. కార్యక్ర మంలో హెచ్‌ఎం ప్రేమ్‌చంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏలూరు ఎడ్యుకేషన్: కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో భావవ్యక్తీకరణ, భావోద్వేగ వ్యక్తీకరణకు మాతృభాషను మించిన మాథ్యమంలేదని ప్రిన్సిపాల్ గిరిబాబు అన్నారు. ఉన్నతవిద్యలో మాతృభాష ద్వారా విద్యాబోధన జరగాలని ఆకాంక్షించారు. ముఖ్యఅతిథి వి.వి.స్వామిని సత్కరించారు. ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ ఉదయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ అజయ్‌కుమార్, అధ్యాపకులు వెంకటరావు, నరసింహారావు తదిత రులు పాల్గొన్నారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతు లు అందజేశారు. శ్రీ శర్వాణి విద్యాప్రాంగణంలో తెలుగుభాషలో చందస్సు, అలంకారాలు, పద్యాలు, కవితలు, పొడుపుకథలు, సామెతలు, జాతీయాలను విద్యార్థులు వివరించారు. తెలుగు కవుల వేషధారణలో భువన విజయం నాట కం, తెలుగు వ్యాకరణాల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. హెచ్‌ఎం సత్యశారద, డైరెక్టర్ మదనమోహనరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నూతన విద్యా విధానం–భాషా బోధన అంశంపై సీఆర్‌ఆర్ కళాశాలలో ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. పూలబాల వెంకట ప్రసాద్ మాట్లాడు తూ మాతృభాషకు పట్టం కట్టినపుడే భాష బతుకుతుందన్నారు. ఏపీ సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి మాట్లాడుతూ మాతృభాషకు, అమ్మ కు విడదీయరాని బంధం ఉందన్నారు. కళాశాల కరస్పాండెంట్ విష్ణుమోహన్, ప్రిన్సిపాల్ రామరాజు, తెలుగు హెచ్‌వోడీ శ్రీనివాసరావు, అధ్యాపకులు రవికుమార్, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం టౌన్: అమ్మభాషకు అక్షరమవుదాం. అమృతం కన్నా, అన్యభాషల కన్నా అమ్మ భాష మిన్న అంటూ విద్యార్థులు నినాదాలు ఇచ్చారు. ప్రతిభ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సరోజారెడ్డి మాట్లాడు తూ అమ్మభాషను మరిస్తే అమ్మను మరిచినట్లేనన్నారు. అనంతరం విద్యార్థు లు పలకలపై తెలుగు వర్ణమాలను ప్రదర్శించారు. ఉపన్యాసాలు, పద్యాలు, సామెతలు, తెలుగు కవితా రీతులను విద్యార్థులు ప్రదర్శించారు. డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, సుభాష్ రెడ్డి, సింధూషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎస్‌టీఎస్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చింతలపూడి డిగ్రీకళాశాల తెలుగు ఉపన్యాసకురాలు బి సర స్వతి మాతృభాష ప్రాధాన్యం వివరించారు. తెలుగు అధ్యాపకులు జి.వెంకట లాల్, పి.నాగేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-21T23:37:23+05:30 IST