ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలుగు సాహిత్యాభివృద్ధికి కవులు, రచయితలు కృషి చేయాలి

ABN, First Publish Date - 2023-06-26T00:07:19+05:30

ఆధునిక సమాజంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి కవులు, రచయితలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి, ప్రముఖ ఆధ్యాత్మిక సాహితీవేత్త బమ్మిడిపాటి బాలత్రిపుర సుందరి కోరారు.

సభలో మాట్లాడుతున్న బాలత్రిపురసుందరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణపవరం, జూన్‌ 25: ఆధునిక సమాజంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి కవులు, రచయితలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి, ప్రముఖ ఆధ్యాత్మిక సాహితీవేత్త బమ్మిడిపాటి బాలత్రిపుర సుందరి కోరారు. విష్ణుసాయి జ్ఞాన జ్యోతి సాహితి సంస్థ రజతోత్సవం స్థానిక కేవీపీ ఫంక్షన్‌హాలులో ఆదివారం నిర్వహించారు. బాలత్రిపురసుందరి మాట్లాడుతూ 25 ఏళ్లుగా సాహితీ సేవ చేస్తున్న విష్ణుసాయి జ్ఞానజ్యోతి సాహితి సంస్థను ఆమె అభినందించారు. రాసిన కవిత్వాన్ని పదేపదే చదివితే మనం రాసిన కవిత్త్వం ఎన్నిసార్లు చదువుతామో అన్ని విజయాలు సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. గురువు ఆచరించిన దానిని శిష్యులకు బోధించాలని సోదాహరణగా తెలిపారు. దేవరుణం, రుషిరుణం, పితృరుణం, ఎలా తీర్చుకోవాలో.. దివి అంటే భగవంతుడని విధి రాతను ఎవరు తప్పించుకోలేరని వివరించారు. మహిళలు అత్యుత్తమమని వారు సమాన హక్కుల కోసం పోరాడటమేమిటని సమాజాన్ని ప్రశ్నిస్తూ స్ర్తీ ప్రాదాన్యత గురించి బాలత్రిపురసుందరి వివరించారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలను సంస్థ అధ్యక్షుడు చక్రవర్తుల సుబ్బారావు సత్కరించారు. చిత్తూరు జిల్లాకు చెందిన కవి, రచయిత పల్లిపట్టు నాగరాజు, విజయవాడకు చెందిన కోపరేటీవ్‌ డిప్యూటీ రిజిస్టార్‌ పెద్దింటి కిరణ్‌కుమార్‌, సంస్థ అధ్యక్షులు నెక్కంటి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:07:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising