ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రమణక్కపేటలో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు

ABN, First Publish Date - 2023-01-19T00:31:51+05:30

రమణక్కపేట కొండగట్టులో బుధవారం అక్రమ గ్రావెల్‌ తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకున్నారు.

కొండగట్టులో అక్రమ తవ్వకాలు జరిపిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొరక్కుండా పోయిన నాలుగు ట్రాక్టర్లు

ఎక్స్‌కవేటర్‌ను పట్టుకున్న గ్రామస్థులు

అధికారులకు అప్పగింత

ముసునూరు, జనవరి 18: రమణక్కపేట కొండగట్టులో బుధవారం అక్రమ గ్రావెల్‌ తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తవ్వకాలను అడ్డుకునే క్రమంలో నాలుగు ట్రాక్టర్లు ఉడాయించగా స్థానికులు ఎక్స్‌కవేటర్‌ను పట్టుకుని అధికారులకు సమాచారమిచ్చారు. వీఆర్వోలు మస్తాన్‌రావు, శోభన్‌బాబు, జూనియర్‌ ఆసిస్టెంట్‌ ఆశోక్‌కుమార్‌, ఫారెస్ట్‌ డీఆర్వో హరిగోపాల్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కొండగట్టు భూమి రెవెన్యూకు చెందినదని నిర్ధాంచారు. పట్టుబడిన ఎక్స్‌కవేటర్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా సాఽ్ధనికులు రంగు వాసు, ఉప్పే సత్యనారాయణ, రంగు నాగాంజనేయులు, కంటే సత్యనారాయణ, రంగు శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ గ్రామంలో కొండగట్టును అధికార పార్టీ నాయకులు రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా తవ్వకాలు జరిపి, గ్రావెల్‌ను అమ్ముకోవటంతో పాటు కొండను కూడా ఆక్రమించు కునేందుకు ప్రయత్నిస్తున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఈ కొండగట్టులో అక్రమంగా తవ్వకాలు చేస్తుంటే అడ్డుకుని, ఆరు ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్‌ను పట్టుకుని, అధికారులకు అప్పగించినట్టు వారు తెలిపారు. అయితే అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకోవటం వల్లే మరలా అధికార పార్టీ నాయకులు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని, అక్రమా ర్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అక్రమ తవ్వకా లు జరగకుండా చర్యలు చేపడతామని తహసీల్దార్‌ దాసరి సుధ తెలిపారు.

Updated Date - 2023-01-19T00:32:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising