భానుడి భగభగలు
ABN, First Publish Date - 2023-06-07T00:05:45+05:30
భానుడి భగభగలతో జనం అపసోపాలు పడుతున్నారు. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
వడగాడ్పులు, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి
ఏలూరు సిటీ, జూన్ 6: భానుడి భగభగలతో జనం అపసోపాలు పడుతున్నారు. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. జిల్లాలో 42 డిగ్రీలు సెంటీగ్రేడ్ మాత్రమే నమోదైనా 50 డిగ్రీలు ఉన్నంత భావన కలుగుతోంది. రాత్రివేళ కూడా వేడిగాలులతో ఉక్కబోతను తట్టుకోలేక ప్రజలు అల్లా డిపోతున్నారు. సాధారణంగా మధ్యాహ్నం 3గంటల తర్వాత ఉష్ణోగ్రత క్రమేపి తగ్గుతుంది. ఈ సారి విభిన్నంగా సాయంత్రం 4 గంటల తర్వాత కూడా వేడి గాలులు, వడగాడ్పులతో వృద్దులు, పిల్లలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. కొయ్యలగూడెం ప్రధాన సెంటర్ 11 గంటలకే నిర్మానుషమైంది. నిత్యం వందలాది వాహనాలతో కిటకిటలాడే జాతీయ రహదారి బోసిపోయింది. దుకాణాలు కూడా మూసివేయడంతో కర్ఫ్యూని తలపించేవిధంగా ప్రధాన రహదారి ఉంది.
Updated Date - 2023-06-07T00:06:08+05:30 IST