ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అభ్యుదయ కవి గురజాడ

ABN, First Publish Date - 2023-09-21T23:54:29+05:30

అభ్యుదయ కవి గురజాడ అప్పారావు విద్యార్థులకు ఆదర్శమని పలువురు వక్తలు అన్నారు.

ఏలూరులో విద్యార్థుల మానవహారం

ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 21: అభ్యుదయ కవి గురజాడ అప్పారావు విద్యార్థులకు ఆదర్శమని పలువురు వక్తలు అన్నారు. గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లాలోని విద్యా సంస్థల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, వేద పాఠ శాలల విద్యార్థులతో ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో గురజాడ జయంతి కమిటీ, సెట్‌వెల్‌, ఏవీఆర్‌ విజ్ఞాన కేంద్రం, డీఆర్‌డీఏ, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రదర్శన, మానవహారం తదితర కార్యక్రమాలు జరిగాయి. తొలుత గురజాడ చిత్రపటానికి ఆర్‌.గోపాలకృష్ణయ్య, ఎంఈవో రంగయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ప్లకార్డులతో ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. దేశభక్తి గేయాన్ని సామూహికంగా ఆలపించా రు. ఇండోర్‌ స్టేడియం నుంచి రిజిస్టర్‌ ఆఫీసు, డీఈవో కార్యాలయం, జిల్లా గ్రందాలయం మీదుగా ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని 25పాఠశాలలు, 5 కళాశాలలనుంచి విద్యార్థులు పాల్గొన్నారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎం.సుజ య్‌ తెలిపారు. గురజాడ జీవితాన్ని, ఆయన రచించిన దేశమును ప్రేమించు మన్నా గేయాన్ని తెలుగువారందరూ ఎల్లవేళలా గుర్తుంచుకోవాలన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు, గురజాడ వేషధారణలు ఆకట్టు కున్నాయి. వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలు, గురజాడ చిత్రపటాలను అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సూర్యారావు, మాన వత సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ ఆలపాటి నాగేశ్వరరావు, ఏవీఆర్‌ విజ్ఞానకేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, అపుస్మా ఏలూరు జోన్‌ అధ్యక్షుడు చంద్ర శేఖర్‌, అజయ్‌బాబు, సత్యనారాయణ, రత్నాకర్‌రావు, బుజ్జి, రమేష్‌, నాయక్‌, శ్రావణి, మోహనరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సీఆర్‌ఆర్‌ అటానమస్‌ కళాశాల, కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గురజాడ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.

టి.నరసాపురం: విద్యార్థులు గురజాడ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల ని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి బీఎన్‌.సాగర్‌ తెలిపారు. మక్కినవారిగూడెంలో అభ్యుదయ రచయితల సంఘం, ప్రైవేటు హైస్కూల్‌ ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు జయంతి నిర్వహించారు. చిన్నారుల పూర్ణ మ్మ కథ నృత్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పురం శ్రీనివాస్‌ అధ్యక్ష తన నిర్వహించిన కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బి.దివ్య భారతి, అర్జా ధర్మారా వు, అడపా కిన్నెర, టి.జ్యోతి, కె.దిలీప్‌ కుమార్‌, పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

పెదపాడు: స్త్రీ సమానత్వం కోసం సంఘ సంస్కర్తగా, రచయితగా గురజాడ అప్పారావు చేసిన కృషి ఎనలేనిదని వట్లూరు సీఆర్‌రెడ్డి మహిళా కళాశాల కరస్పాండెంట్‌ చలసాని విశ్వనాథరావు అన్నారు. గురజాడ జయంతి ని కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు.

చింతలపూడి: గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ప్రజా సం ఘాల కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. గురజాడ అడుగుజాడలు నేటికీ సంఘంలో కనిపిస్తున్నాయని రిటైర్డ్‌ అధ్యాపకులు మల్లెల జయరాజు అన్నారు. కార్యక్రమంలో ఆర్నేపల్లి అప్పారావు, ఎస్‌.సూర్యకుమార్‌, జోషి, తదితరులు పాల్గొన్నారు.

భీమడోలు: అన్నేవారిగూడెం పాఠశాలలో గురజాడ అప్పారావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising