ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వశిష్ఠ ఉరకలు

ABN, First Publish Date - 2023-07-21T00:21:03+05:30

గోదావరికి వరద తాకడంతో జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎగువ ప్రాంతంలో వరద మట్టం పెరిగితే ఆ ప్రభావం వశిష్ఠ మీద పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టారు. బలహీనంగా ఉన్న గట్లను గుర్తించి ఇసుక బస్తాలను తరలిస్తున్నారు. మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేయగానే యలమంచిలి, కాజా, నరసాపురం ప్రాంతాల్లోని ఆరు మేజర్‌ అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ తలుపులు మూసివేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఆచంటలో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న గోదావరి

అధికారులు అప్రమత్తం

గోదావరిలో వలకట్లు తొలగింపు

నరసాపురం, జూలై 20: గోదావరికి వరద తాకడంతో జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎగువ ప్రాంతంలో వరద మట్టం పెరిగితే ఆ ప్రభావం వశిష్ఠ మీద పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టారు. బలహీనంగా ఉన్న గట్లను గుర్తించి ఇసుక బస్తాలను తరలిస్తున్నారు. మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేయగానే యలమంచిలి, కాజా, నరసాపురం ప్రాంతాల్లోని ఆరు మేజర్‌ అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ తలుపులు మూసివేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గురువారం వశిష్ఠాలోకి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు. దీంతో నరసా పురం వద్ద వశిష్ఠ నీటి ప్రవాహంతో కళకళలాడుతోంది. గతేడాది జూన్‌ నెలలోనే వశిష్టా వరద తాకింది. ఆ తరువాత జూలైలోనూ రెండోవసారి వరద వచ్చింది. 1986 తరువాత అత్యధికంగా వరద రావడం ఇదే. ఈ ప్రవాహానికి నరసాపురం వద్ద ఏటిగట్టు 40 మీటర్ల మేర కొట్టుకు పోయింది. తాత్కాలికంగా అడ్డుకట్ట వేసినా ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న భయంతో వారం రోజుల పాటు ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రస్తుతం వరద వచ్చినా పెద్దగా ముంపు ఉండదని భావిస్తున్నారు. ఇప్పటికే కోతకు గురైన ఏటిగట్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వరద తీవ్రస్థాయిలో వచ్చినా ప్రమాదం లేకుండా రాళ్ళతో అడ్డుకట్ట వేశారు.మాధవాయిపాలెం స్లూయిస్‌ తలుపులు కూడా మరమ్మతులు చేయించారు. యలమంచిలి మండలం కాజా స్లూయిస్‌, ధర్భరేవు స్లూయిస్‌ తలుపులు కూడా మరమ్మతులు చేశారు. దీనివల్ల ఈసారి వరదకు పెద్దగా ముంపు ఉండదని అధికారులు భావిస్తున్నారు. అయితే దొడ్డిపట్ల వద్ద 50 మీటర్ల మేర ఏటిగట్టు పనులు పెండింగ్‌ పడ్డాయి. అక్కడ ఇసుక బస్తాలతో గట్టును పటిష్ఠపర్చారు. ఐదేళ్ళుగా వరదకు ఇక్కడే ఎక్కువుగా నష్టం జరుగుతోంది. మరోవైపు నరసాపురం మండలంలోని నవరసపురం, లాకు పేట, ఎస్టీ కాలనీలకు కూడా వరదొస్తే ముంపు తప్పడం లేదు. ముస్కేపాలెం, పీచుపాలెం వద్ద స్లూయిస్‌ల లీకేజీలు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు వరద తగ్గే వరకు గట్టుపై గస్తీ పెంచారు. నరసాపురం వద్ద గోదావరిలో కట్టిన వలకట్లను మత్స్యకారులు తొలగించారు. ఏటిగట్టుల శాఖ ఏఈ సుబ్బారావు పరివాహక ప్రాంతాల్లో పర్యటించి గట్టు, స్లూయిస్‌ పరిశీలిస్తున్నారు. అవసరమైన చోట్ల ఇసుక బస్తాలను రెడీ చేస్తున్నారు.

పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

గురువారం రాత్రి సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ పట్టణంలోని వలంధర్‌, పొన్నపల్లి రేవుల్ని పరిశీలించారు. రానున్న 24 గంటల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏటిగట్లను ఎప్పటికప్పుడు తనఖీ చేస్తూ బలహీన పడుతున్న ప్రదేశాలలో ఇసుక బస్తాలతో పటిష్ట పర్చాలన్నారు. గోదావరి పరివాహక ప్రదేశాలలో పనిచేసే సిబ్బంది అంతా స్ధానికంగా అందుబాటులో ఉండాలని, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలియజేయాలని అదేశించారు.

కాటన్‌ బ్యారేజ్‌ గేట్లు పూర్తిగా ఎత్తివేత

ధవళేశ్వరం, జూలై 20: ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం వద్ద గోదావరి పరమళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో కాటన్‌ బ్యారేజ్‌ మొత్తం 175 గేట్లను పూర్తి ఎత్తివేసి ఎగువ ప్రవాహాన్ని దిగువకు వదిలివేసు ్తన్నారు. గురువారం సాయంత్రానికి 6.94 లక్షల క్యూసెక్కులు దిగువకు ప్రవహి స్తోంది. నీటి మట్టం 9.60 అడుగులుగా నమో దైంది. శుక్రవారం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 11.75 అడుగులకు నీటిమట్టం చేరుకుని ఆపై తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తు న్నారు. ఎగువన భద్రాచలం వద్ద గురువారం ఉదయం వరకు నీటి మట్టం క్రమంగా పెరిగింది.

చెదురుమదరు వానలు

భీమవరం టౌన్‌ : అల్పపీడనం కారణంగా గురు వారం జిల్లాలో చెదురుమదురు వానలు కురిశాయి. జిల్లాలో అత్యధికంగా తాడేపల్లిగూడెంలో 22.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తణుకు 12.6, పెంట పాడు 9.2. అత్తిలిలో 5.2 పెనుమంట్ర 11, గణపవరం 5.4, పాలకోడేరు 5.2, ఇరగవరం 6.2 పెనుగొండ మండ లంలో 12 మి.మీ వర్షపాతం నమోదైంది.. జిల్లా మొత్తం మీద 92.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - 2023-07-21T00:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising