‘గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి
ABN, First Publish Date - 2023-01-30T23:51:04+05:30
జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఎంపీడీవో జి.రాణి అన్నారు. మండలంలో గాంధీ వర్ధంతి కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు.
ముసునూరు, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఎంపీడీవో జి.రాణి అన్నారు. మండలంలో గాంధీ వర్ధంతి కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆమెతో పాటు ఈవోపీఆర్డీ బీఏ సత్యనారాయణ, సూపరింటెండెంట్ కె.సాయిరాము గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లోపూడి ఆశ్చర్య పాఠశాలలో ప్రిన్సిపాల్, జడ్పీటీసీ వరకూటి ప్రతాప్ గాంధీజీకి నివాళులు అర్పించారు. ముసునూరు మెయిన్ సెంటర్‌లో గాంధీ విగ్రహనికి బీజేపీ నాయకులు గుడివాడ వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
కైకలూరు : కైకలూరులో గాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి పీజేఎస్ మాల్యాద్రి, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు కేకే బాబు, టీడీపీ నాయకులు వేముపల్లి కారుణ్య, బంకపల్లి భాస్కరరావు, గంగుల ఏసురాజు, లిక్కంశెట్టి మోహన్, చెక్కా పూర్ణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
నూజివీడు టౌన్, : జాతిపిత మహాత్మగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీ పీ నూజివీడు నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డు వేణుగోపాలరావు గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళుల ర్పించారు. టీడీపీ నూజివీడు మండల అధ్యక్షుడు ముసునూరు రాజా, మైనార్టీ సెల్ నాయకులు సయ్యద్‌ఇబ్రహీమ్, టీడీపీ నాయకులు తాళం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నూజివీడు నియోజకవర్గ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీడీ రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పరిమి సాగర్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగభరత్, పీసీసీ సభ్యులు పీఆర్‌బీ విఠల్‌కుమార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు బొందిలి రామ్‌సింగ్, గోళ్ళ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిన్న గాంధీ బొమ్మ సెంటర్లోని గాంధీ విగ్రహానికి జనసేన నాయకులు సూరిశెట్టి శివ, సునీల్‌కుమార్, ఏనుగుల చక్రి తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు.
చాట్రాయి మండలంలో మహాత్మగాంధీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. చాట్రాయి సచివాలయంలో గ్రామ సర్పంచ్ దామెర ఉష గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా సీహెచ్‌వో జీవీ రమణ హాజరయ్యారు. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కలిదిండి : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సీతారామ కుమార్, సిబ్బంది గాంఽధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తేజోమణి, సిబ్బంది గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిప్యూటీ తహసీల్దార్ రాంబాబు, ఆర్‌ఐ విజయలక్ష్మి, వీఆర్వోలు పాల్గొన్నారు. కలిదిండి జడ్పీ హైస్కూల్‌లో ఆర్యవైశ్య సంఘీయులు, ఉపాధ్యాయులు, నివాళులర్పిం చారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు నూకల శ్యామలరావు గుప్తా, చక్కా జగన్, నీలి సుమన్, వాయుగుండ్ల రామకృష్ణ, నీలి రత్నాకరరావు పాల్గొన్నారు.
ముదినేపల్లి, : ముదినేపల్లి మండలంలో పలు చోట్ల గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘ నాయకులు మాడుగుల పూర్ణచంద్రరావు, చీదెళ్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు, వత్తుమిల్లి ప్రసాద్, కొల్లిపర రఘురామన్, జల్లూరి విక్రమ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోమర్రు రోడ్డు వద్ద గాంధీ విగ్రహానికి పీసీసీ సభ్యుడు మంగినేని బాబ్జి, కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ’
Updated Date - 2023-01-30T23:51:05+05:30 IST