ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలిరోజు రూ. 15 కోట్లు

ABN, First Publish Date - 2023-01-15T01:22:29+05:30

పందెం పుంజులు కత్తులు నూరుతున్నాయి. పందేలకు కాలు దువ్వుతూ కదం తొక్కుతున్నాయి. బరులపై విరుచుకుపడ్డ పోలీసుల షరతులు భోగి నాటికి హుష్‌ కాకి అన్నాయి. ఫలితంగా ముచ్చటైన మూడు రోజుల పండుగలో తొలి నాడే రూ.15 కోట్లకుపైగా పందే లకు బరులు బుసలు కొట్టాయి.

ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లిలో..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయం 11 గంటలకు తెరుచుకున్న బరులు

యథేచ్ఛగా కోడి పందేలు, గుండాట, పేకాట

కనిపించని పోలీసులు.. వైసీపీ నాయకులదే హవా

ఏలూరు జిల్లాల్లో పోటా పోటీగా బరులు

మూడు పందేలు గెలిచిన వారికి స్విఫ్ట్‌ కారు బహుమతి

పందెం పుంజులు కత్తులు నూరుతున్నాయి. పందేలకు కాలు దువ్వుతూ కదం తొక్కుతున్నాయి. బరులపై విరుచుకుపడ్డ పోలీసుల షరతులు భోగి నాటికి హుష్‌ కాకి అన్నాయి. ఫలితంగా ముచ్చటైన మూడు రోజుల పండుగలో తొలి నాడే రూ.15 కోట్లకుపైగా పందే లకు బరులు బుసలు కొట్టాయి. కైకలూరు, జంగారెడ్డిగూడెం, ఏలూరు, దెందులూరు, పెదవేగి తదితర ప్రాంతాలన్నీ కలిపి సుమారు 84కు పైగా బరుల ద్వారా కత్తి కట్టిన కోడి తాండవమాడుతోంది. కైకలూరు మండలం ఆలపాడులో వరుసగా మూడు పందేలు గెలిచిన పశ్చిమ గోదావరికి చెందిన ఓ వ్యక్తి లక్షలాది రూపాయల పందెం సొమ్ముతోపాటు స్విఫ్ట్‌ కారును అదనపు బహుమతిగా గెలుచుకున్నాడు. దాదాపు అన్ని చోట్ల అధికార పార్టీ నాయకుల అండదండలతో పందెం బరులు కిటకిటలాడుతున్నాయి. దెందులూరు ఎమ్మెల్యే తండ్రి ఆధ్వర్యంలో నిర్వహించే బరిలో ఒక్క భోగి రోజే రూ.2 కోట్లకు పైగా పందేల్లో చేతులు మారాయని సమాచారం.

(ఏలూరు/జంగారెడ్డిగూడెం/ కైకలూరు–ఆంధ్రజ్యోతి):

నిన్నటి వరకు కోడి పందేలకు అనుమతులు ఇవ్వబోమని, అనధికారికంగా నిర్వహిస్తే అరెస్టులు తప్పవని అధికారులు నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. జిల్లాలోని పలు మండలాల్లో భారీగా కోడి కత్తులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. చాలాచోట్ల అరెస్టులు చేశారు. కట్‌ చేస్తే కత్తి కట్టకుండా కోడి పందేలు నిర్వహించాలని తూతూమంత్రపు సూచనలతో పందేలకు అధికారులు అనుమతులిచ్చారు. దీంతో ఏలూరు జిల్లాలోని అన్ని మండలాల్లో పందేలు జోరందుకున్నాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెం, కైకలూరు, దెందులూరుతోపాటు నూజివీడు తదితర ప్రాంతాల్లో బరులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేశాయి. శనివారం ఉదయం నుంచి భారీగా పందెం రాయుళ్లు బరుల దగ్గర హల్‌చల్‌ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల మద్దతుతో నిర్వహిస్తోన్న భారీ బరుల్లో ఏకంగా కోట్లలో పందేలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ కాబట్టి పోలీసులతోనూ సమస్య ఉండదన్న నమ్మకంతో లక్షల్లో పందేలు కట్టే వారంతా ఆ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆదివారం తెల్లవారు జాము దాకా కొనసాగే ఈ బరుల్లో ఒక్క భోగి రోజే రూ.15 కోట్లకు పైగా పందేలు జరుగుతున్నాయని సమాచారం.

అధికార పార్టీ నాయకుల అభయం

దెందులూరు ఎమ్మెల్యే తండ్రి కొఠారు రామచం ద్రరావు ఆధ్వర్యంలో వారి స్వగ్రామమైన కొండల రావుపాలెంలో జరిగే బరిలో భారీగా పందేలు నిర్వహిస్తున్నారు. లోన బయట కలిపి రూ.2 కోట్ల వరకు పందేలు కడుతున్నారు. దెందులూరు నియో జకవర్గంలో దెందులూరు, పాలగూడెం, గుండు గొలను, కొమిరేపల్లి, సీతమ్మపేట, లక్ష్మీపురం, విజయ రాయి, జానంపేట, వేగివాడ, పెదవేగి, పెదకడిమి, మొట్ట పగిడిగూడెంలలోని బరుల్లో భారీగా పందేలు జరుగుతున్నాయి. బుట్టాయిగూడెంలో స్థానిక ఎమ్మె ల్యే తెల్లం బాలరాజు దగ్గరుండి కోడి పందేలను ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం మండలం, శ్రీనివాసపురంలో జడ్పీటీసీ పోలినాటి బాబ్జి రిబ్బన్‌ కట్‌ చేసి పందేలు ప్రారంభింపజేశారు. మండలాల వారీగా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద బరులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో జరిగే పెద్ద బరుల్లో ఒక్కో పందెం రూ.50 వేలు మొదలుకుని రూ.7 లక్షల వరకు జరుగుతున్నాయి. కైకలూరులోని ఆలపాడు గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక బడా వ్యక్తి కనుసన్నల్లో కోడి పందేలు, లోనబయట పేకాట, గుండాట పెద్ద ఎత్తున నిర్వహించారు. ఐదు పందేలకుగానూ వరుసగా 3 పందేలు గెలుచుకున్న వ్యక్తికి అదనంగా స్విఫ్ట్‌ కారును బహుకరించారు. తొలి రెండు పందేల్లో ఒక్కోటి రూ.2 లక్షల చొప్పున, లో పందెం కింద ఇరు వర్గాలకు కలిపి రూ.8 లక్షలకు జరగ్గా, మిగిలిన మూడు పందేల్లో ఒక్కోటి రూ.లక్ష చొప్పున రూ.6 లక్షలకు జరిగాయి. ఈ శిబిరంలో ఎల్‌ఈడీ స్ర్కీన్లు వీక్షించేందుకు

అవకాశం కల్పించారు. ప్రతీ కోడిపందాన్ని వీడియోలో చిత్రీకరించారు. ప్రజలు, ప్రేక్షకులు వీక్షించేందుకు ఏర్పాట్లు నిర్వహించారు. కైకలూరు బైపాస్‌రోడ్డులో పోలీసులు పికెట్లు పెట్టినప్పటికీ పేకాట, గుండాట, కోడిపందాలను నిర్వహించారు. వదర్లపాడు బ్రాంచి, ఆటపాక, వరహాపట్నం గ్రామాల్లో పందేలను భారీగా నిర్వహించారు. కైకలూరులో పలు ప్రదేశాల్లో పేకాట పెద్దఎత్తున నిర్వహిస్తుండగా ఓ చెరువుగట్టుపై నిర్వహిస్తున్న పేకాట శిబిరం వద్ద రూ.40 లక్షలు చేతులు మారినట్లు సమాచారం. కైకలూరు నియోజకవర్గంలో రూ.5 కోట్లకు పైగా, జంగారెడ్డిగూడెంలో రూ.3 కోట్లకు పైగా పందే లు జరుగుతున్నాయి. ఒక్క పెదవేగి మండలంలోనే బోగి పండుగ రోజు దాదాపు రూ.1.50 కోట్లకు పైగా పందేలు జరుగుతున్నాయి. పెద్ద బరులు ఉన్నచోట జాతర వాతావరణంలో నిర్వాహకులు ఎల్‌ఈడీ స్ర్కీన్లు, బౌన్సర్లు. భారీ భద్రత నడుమ పందేలను నిర్వహిస్తున్నారు. బయటి వ్యక్తుల నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేసుకున్న ఆ బరుల్లో వీఐపీలు, ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా విచ్చేస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.

పందెం.. మద్యం.. మాంసం..!

కోడి పందేలతోపాటు గుండాట, లోన–బయట (మూడు ముక్కలాట) వంటి జూదాలు సాగుతున్నాయి. మరోవైపు బెల్టు షాపులు వెలిశాయి. పేకాట స్థావరాలను ఏర్పాటు చేశారు. పందేలకు వచ్చిన వారిలో అనేక మంది మద్యం తాగుతూ, మాంసాహారం తింటూ జోష్‌గా కనిపించారు. జూదంలో జనం లక్షలాది రూపాయలు సమర్పించుకున్నారు. ఎంతో హుషారుగా వచ్చిన జనం, ఖాళీ జేబులతో నీరసంగా వెనుదిరిగారు.

ఇక పండుగ రోజు అధికారులంతా అత్తారింటికి వెళ్లినట్టు ఒక్కరూ కన్పించకపోవడంతో అధికార పార్టీ నాయకులంతా రంగంలోకి దిగారు. ఇక మూడు రోజులు అంతా మేమే. అధికారులు, పోలీసులు ఎవరూ ఇటుగా రారు. ధైర్యంగా పందేలు కాసుకోండంటూ భరోసా ఇవ్వడంతో భోగి రోజు ఉదయం పదకొండు గంటల నుంచే యథేచ్ఛగా సాగాయి. రాత్రి వేళల్లో ప్లెడ్‌ లైట్‌ల వెలుగుల్లో సైతం నిర్వహించేందుకు ప్రధాన బరుల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

కుక్కునూరు మండలం కుక్కునూరు, దాచారం, చీరవల్లి, వేలేరు గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో భారీగా జనాలు తరలివచ్చారు. ముదినేపల్లి మండలం ఈడేపల్లి, ముదినేపల్లి, బొమ్మినంపాడు గ్రామాల వద్ద పెద్ద బరులు నిర్వహించగా, పేరూరులో చిన్న బరి ఏర్పాటు చేశారు. తొలి రోజు రూ.40 లక్షలు చేతులు మారాయి.

జిల్లాలోని చింతలపూడి, ఉంగుటూరు, గణపవరం, భీమడోలు మండలంలోని గుండుగొలనుతో పాటు జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో సుబ్బమ్మ పేట, శ్రీనివాసపురం, బుట్టాయిగూడెం మండలంలో బూసరాజుపల్లె తదితర ప్రాంతాల్లో పందేలు జోరందుకున్నాయి.

Updated Date - 2023-01-15T01:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising