ఉద్యోగుల ఐక్య ఉద్యమాలు
ABN, First Publish Date - 2023-09-23T00:29:34+05:30
పాత పెన్షన్ పునరుద్ధ్దరణే ఏకైక లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం, ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో)లు ఏకతాటిపైకి వచ్చాయి.
జీపీఎస్‌పై ఉపాధ్యాయుల నిరసన
నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు
ఏలూరు ఎడ్యుకేషన్, సెప్టెంబరు 22 : పాత పెన్షన్ పునరుద్ధ్దరణే ఏకైక లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం, ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో)లు ఏకతాటిపైకి వచ్చాయి. జీపీఎస్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉండడంతో, ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు పాలకపక్షంపై తీవ్ర వ్యతిరేకతను తెలియజేసే క్రమంలో శుక్రవారం సాయంత్రం ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించాలని భావించినప్పటికీ అడ్డుకునేందుకు పోలీ సులు చర్యలు చేపట్టడంతో సంఘ నాయకులు ఆందోళనను చేపట్టకుండానే ఉపసంహ రించుకున్నారు. అదే సమయంలో ఫ్యాప్టో నుంచి మద్దతు రావడంతో జీపీఎస్‌కు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను చేపట్టాలని నిర్ణయించారు. సీపీఎస్/జీపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగ, ఉపాధ్యాయులతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో టీచర్లు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. తక్షణమే జీపీఎస్ బిల్లుని ఉపసంహరించుకుని ఓపీఎస్‌ను పున రుద్ధరించాలని డిమాండ్ చేశారు.
పశ్చిమలో నిరసనలు
యలమంచిలి : సీపీఎస్‌ను రద్దు చేసి అంతకంటే దుర్మార్గమైన జీపీఎస్‌ను ఉద్యోగులు, ఉపాధ్యాయులపై బలవంతంగా రుద్దే ప్రయ త్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ స్కీం తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ యల మంచిలి మండలంలోని ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం విధులకు హాజరై నిరసన తెలిపారు. మండలంలోని ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యూటీఎఫ్ మండలశాఖ ప్రధాన కార్యదర్శి పి.రామ్మూర్తి నాయుడు, ఎస్.అవధాని, బి.విజయపద్మ, రామేశ్వరపు సత్యనారాయణ, దొమ్మేటి చంద్రశేఖరరావు, సఖిలే వెంకటేశ్వరరావు, డి.ఆదినారాయణ, టి.గాంధీ, చల్లారావు, ఎస్.వెంకటరామయ్య పాల్గొన్నారు.
మొగల్తూరు: ఉద్యోగ, ఉపాధ్యాయులపై జీపీఎస్ ఆర్డినెన్స్‌ను బలవంతంగా రుద్దుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. శుక్రవారం కేపీ పాలెం ఉన్నత పాఠశాల ప్లస్ స్కూల్‌లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరస తెలిపరు. యూటీఎప్ రాష్ట్ర కౌన్సిలర్ చింతపల్లి కృష్ణమోహన్, ఉపాధ్యాయ సంఘ నాయకులు యడ్ల ధర్మారావు, వాటాల సత్యనారాయణ, ఉమాదేవి, కేవీ మంగతాయారు, జితేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. తణుకు: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం మునిసిపల్ ప్రాథమిక పాఠశాల నెం.3 వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్, జీపీఎస్ వల్ల పదవీ విరమణ అనంతరం వెయ్యి నుంచి రూ.1500 మాత్రమే వస్తుందని, వృద్ధాప్యంలో బతుకు భారమ వుతుంద న్నారు. టీచర్లు అంజిబాబు, రాజకుమార్, కామాక్షి, ప్రదీప్ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: ఉద్యోగుల కష్టాన్ని దోచుకునేలా ప్రభుత్వం జీపీఎస్ రూపొందించిందని సీపీఎస్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి నాగేశ్వరరావు ఆరోపించారు. దండగర్ర జడ్పీ హైస్కూల్, యాగర్లపల్లి మున్సిపల్ హైస్కూల్ తదితర పాఠఠశాలల వద్ద ఉపాధ్యా యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
భీమవరం రూరల్ : పాత పెన్షన్ తప్ప వేరే ప్రత్యామ్నాయ పెన్షన్‌లు అవసరం లేదని వాటిని ఒప్పుకునేది లేదని జిల్లా ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరవల్లి వెంకటేశ్వరరావు అన్నారు. దుర్మార్గమైన విధానాలను వ్యతిరేకిస్తూ భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్యోగ ఉపాధ్యా యులు నిరసన వ్యక్తం చేశారు. ఐక్య ఉపాధ్యాయ పెడరేషన్ రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి మాట్లాడుతూ పాత సీపీఎస్ రద్దు చేసేవరకు పోరాటం ఆగదన్నారు. ఆనంద్, బోసుబాబు, కళ్యాణి, రాము, గంగాధర్ పాల్గొన్నారు.
Updated Date - 2023-09-23T00:29:34+05:30 IST