ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

ABN, First Publish Date - 2023-08-02T00:11:45+05:30

విద్యుత్‌ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని, ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు నిరసన తెలిపారు.

కలెక్టరేట్‌ వద్ద విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

వేతన సవరణ చేయాలని ఆగ్రహం

ఏలూరు కలెక్టరేట్‌, ఆగస్టు 1 : విద్యుత్‌ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని, ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు నిరసన తెలిపారు. స్థానిక విద్యుత్‌ భవనం నుంచి వందలాది మంది ఉద్యోగులు భారీ ర్యాలీ, ప్రదర్శన మంగళవారం నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ డిస్కమ్‌ కన్వీనర్‌ భూక్యా నాగేశ్వరరావు, కో–కన్వీనర్‌ తురగా రామకృష్ణ, రమేష్‌ తదితరులు మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికుల సమస్య లపై యాజమాన్యం చిన్న చూపు చూస్తుం దని మండిపడ్డారు. వేతన సవరణకు గడువు ముగిసి 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ వేతనాలు పెం చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు ఫణం గా పెట్టి విధి నిర్వహణలో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేయడం లేదన్నారు. ప్రతినెలా వేతనం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈపీఎఫ్‌ నుంచి జీఎఫ్‌కు మార్చి పెన్షన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, కార్మికులు ఫ్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. అనంతరం డీఆర్వో సత్యనారాయణమూర్తిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

Updated Date - 2023-08-02T00:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising