ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మేడమ్‌కు ఆశ ఎక్కువే..!

ABN, First Publish Date - 2023-07-21T00:25:40+05:30

ప్రతీ పనికి ఫిక్స్‌డ్‌ రేటు నిర్ణయించి మరీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడుతున్న ఓ వైద్యాధికారిణి అవకతవ కల చిట్టాపై గురువారం ఆంధ్రజ్యోతిలో ‘మేడం వస్తున్నారహో’ శీర్షికన ప్రచురితమైన కథనం వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మేడం వస్తున్నారహో.. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై వైద్య ఆరోగ్య శాఖలో కలకలం

ప్రైవేటు వ్యక్తులకు ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా లంచం సొమ్ము బదిలీ

కార్యాలయంలోనే రెండంచెల్లో అమ్యామ్యాలకు కౌంటర్లు

కారుణ్య నియామకాలపైనా కరుణ లేదు

తీవ్ర చర్యలకు ముందే బదిలీ యత్నాలు

ప్రతీ పనికి ఫిక్స్‌డ్‌ రేటు నిర్ణయించి మరీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడుతున్న ఓ వైద్యాధికారిణి అవకతవ కల చిట్టాపై గురువారం ఆంధ్రజ్యోతిలో ‘మేడం వస్తున్నారహో’ శీర్షికన ప్రచురితమైన కథనం వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కథనంలో కొన్ని అంశాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయని, కీలకమైనవి చాలానే ఉన్నాయని ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా వెలుగుచూసిన వాటిలో మరికొన్ని..

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 20 : వైద్యాధికారిణి లంచా లకు బెంబేలెత్తిన పలువురు నేరుగా జిల్లా సర్వోన్నతాధికారి దృష్టికి కొద్ది రోజుల క్రితమే తీసుకెళ్ళారని సమాచారం. ఈ అవినీతిపై సమగ్ర సమాచారంతోవున్న ఆ అధికారి తనను ప్రభుత్వానికి సరెండర్‌ చేసే అవకాశాలపై సంకేతాలు ఉండ డంతో ఆ పరిస్థితి రాకుండానే పొరుగున వున్న ఓ జిల్లాకు రాగల పది రోజుల్లో బదిలీ చేయించుకునేందుకు సన్నద్ధమవు తున్నట్టు తెలుస్తోంది. వైద్యాధికారిణి అవకతవకలపై మరి కొన్ని వెలుగులోకి వచ్చాయి. నూజివీడు డివిజన్‌లోని ఓ పీహెచ్‌సీలో పనిచేయాల్సిన ఉద్యోగి (మాజీ సీసీ) వైద్యాధి కారిణి వసూళ్లకు ఏజెంట్‌గా వ్యవహరిస్తూ, ఆమె సందర్శించా ల్సిన పీహెచ్‌సీల మెడికల్‌ ఆఫీసర్లకు ముందుగానే ఫోన్‌ చేసి డబ్బులు రెడీ చేసుకోవాలని ఆదేశాలు జారీచేయడం షరా మామూలేనని చెబుతున్నారు. పీహెచ్‌సీ కార్యకలాపాలు, రికార్డుల్లో లోపాలను వెతకడంలో దిట్ట అయిన ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ స్థాయి ఉద్యోగి ఒకరు ఇచ్చే సమాచారం ఆధారంగా సంబంధిత వైద్యాధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో మాజీ సీసీ అనుభవజ్ఞుడని తెలు స్తోంది. ఈ క్రమంలో లంచంగా ఇచ్చే డబ్బులను భౌతికంగా తీసుకోకుండా వైద్యాధికారిణికి చెందిన ప్రైవేటు వాహన డ్రైవర్‌కు ఫోన్‌ పే లేదా గూగుల్‌ పేలకు ట్రాన్స్‌ఫర్‌ చేయిం చడం ద్వారా ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడతున్నారని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బినామీల ద్వారా ఈ రకమైన ఎలకా్ట్రనిక్‌ చెల్లింపు విధానాన్నే ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీలకు వెళ్ళినపుడు అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది.

కారుణ్య నియామకాలనూ వదలట్లేదట..

ఉద్యోగ కాలంలో చనిపోయిన ఉద్యోగుల వారసులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇచ్చే కారుణ్య నియామ కాల విషయంలోనూ వైద్యాధికారిణి తన అవినీతిని కొన సాగిస్తుండటం ఇటీవల సర్వోన్నతాధికారి దృష్టికి వెళ్లింది. ముగ్గురు ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున డిమాండ్‌ చేయడం, వీరిలో ఒకరు వైద్యాధికారిణి లంచం డిమాండ్‌ గురించి నేరుగా సర్వోన్నతాధికారికి తెలిసేలా ప్రయత్నించడంతో అవినీతికి ఆస్కారం లేకుండానే వారికి నియామక పత్రాలు అందాయి.

కార్యాలయంలో రెండు కీలక సెక్షన్లలోని నలుగురు ఉద్యోగులు ‘మేడం’ అవినీతితో నిమిత్తం లేకుండా సొంతం గానే కౌంటర్లు తెరిచి, ప్రతీ దానికి పని స్వభావాన్ని బట్టి రేట్లు నిర్ణయించడం సర్వోన్నతాధికారి దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే కొందరు ఉద్యోగులు చేసిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించడం గమనార్హం. మెడికల్‌ లీవు, సర్వీస్‌ రిజిస్టర్‌, ఎర్న్‌డ్‌ లీవుల మంజూరు, సెలవు ముగి సిన అనంతరం విధుల్లో చేరడానికి అనుమతుల జారీ తదితర అంశాల్లో ఈ ఉద్యోగులు ప్రతిపాదనలను ప్రాథ మికంగా ఆమోదించి ‘మేడం’కు పంపడానికి ముందుగానే డబ్బులు వసూలు చేసుకుంటారని, ఫైలు వీరి నుంచి దాటిన తర్వాత మళ్ళీ ‘మేడం’ నిర్ణయించిన రేటు ప్రకారం సమర్పించిన తర్వాతే తుది అనుమతులు, ఉత్తర్వులు చేతికి అందుతాయని ప్రచారం జరుగుతోంది.

కొద్ది రోజుల క్రితం జరిగిన స్టాఫ్‌ నర్సుల అంతర్‌ జిల్లా బదిలీల్లో ఉత్తర్వులు పొందిన వారికి రిలీవింగ్‌ ఆర్డర్లు జారీ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు డిమాండ్‌ చేయడంపై సర్వోన్నతాధికారికి ఫిర్యాదు అందిన విషయం ఆ శాఖకు సంబంధించిన వాట్సాప్‌ గ్రూపులో బహిర్గతం కావడం కలకలం రేపింది. అదేరోజు సాయంత్రంలోగా బదిలీ అయిన స్టాఫ్‌ నర్సులకు రిలీవింగ్‌ ఉత్తర్వులు అంద కపోతే కఠిన చర్యలు తప్పవని సర్వోన్నతాధికారి తీవ్ర స్థాయిలో హెచ్చరించినప్పటికీ లంచం మోతాదు ‘మేడం’ స్థాయిలో మినహాయించి, సంబంధిత సెక్షన్‌ ఉద్యోగుల వరకే పరిమితం చేసుకుని ఇచ్చినట్టు సమాచారం.

వైద్యాదికారిణి అవినీతిపై సమగ్ర సమాచారం వున్న సర్వోన్నతాధికారి ఇకపై ‘మేడం’ను ఆస్పత్రుల విజిట్‌లకు వెళ్ళవద్దని సూచించడంతోపాటు, సంక్షేమ వసతి గృహాల్లో ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేయాలని కోరినట్టు తెలిసింది. ఈమె అండదండలు చూసుకున్న మాజీ సీసీ ఉద్యోగి తన పనిస్థానాన్ని విడిచిపెట్టి వైద్యాధికారిణి వెంట తనిఖీలకు వెళ్లడం, పీహెచ్‌సీల మెడికల్‌ ఆఫీసర్లను ఏకవచనంతో చులకనగా సంబోధిస్తుండటం జరుగుతు న్నట్టు వాపోతున్నారు. తాజాగా వైద్యాధికారిణి బుధవారం సందర్శించిన పీహెచ్‌సీలకు మాజీ సీసీ కూడా వెంట ఉండటం అవినీతి కార్యకలాపాలకు బలం చేకూరుస్తోంది.

ప్రభుత్వపరంగా సమకూర్చిన వాహనాన్ని జిల్లాలో బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలగించి, తన సొంత కారునే ట్రాన్స్‌పోర్టు వాహనంగా రిజిస్ట్రేషన్‌ చేయించి వాడుకుంటూ ప్రభుత్వం ఇచ్చే అద్దె సొమ్మును వైద్యాధి కారిణి తీసుకుంటున్నట్టు సమాచారం. ఈవన్నీ సర్వోన్నతా ధికారికి తెలిసిపోవడంతో ఆయన చర్యలు తీసుకోక ముందే బదిలీపై వెళ్లిపోవడానికి వైద్యాధికారిణి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2023-07-21T00:25:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising