రూప్ చంద్ కిలో రూ.95
ABN, First Publish Date - 2023-06-25T23:40:08+05:30
రైతులకు సిరులు కురిపించిన రూప్‌చంద్ చేప పతనం దిశగా పయనిస్తోంది. కిలో రూ.115 పలికిన ధర ప్రస్తుతం రూ.95లకు పడిపోయింది.
గిట్టుబాటు కాక రైతుల నష్టాలపాలు
కలిదిండి, జూన్ 25 : రైతులకు సిరులు కురిపించిన రూప్‌చంద్ చేప పతనం దిశగా పయనిస్తోంది. కిలో రూ.115 పలికిన ధర ప్రస్తుతం రూ.95లకు పడిపోయింది. గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఉత్తరాది సముద్రపు చేప అధికంగా ఉత్పత్తి అవుతుండడంతో చెరువుల్లో పెంచే రూప్‌చంద్ ధర పతనమవుతోందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి జూన్ 1వ తేదీ వరకు రెండు నెలల సమయం సముద్రపు చేప పట్టు బడులకు విరామం ప్రకటిస్తుంది. అనంతరం జూన్ 1 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లి చేపలను పట్టి బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి సిద్ధం చేస్తుంటారు. ఈ కారణంతోనే చెరువుల చేపల ధరలు తగ్గుముఖం పట్టాయని ఆందోళన చెందుతున్నారు. రూప్‌చంద్ చేప ఎక్కువగా కొనుగోలు చేసే అస్సోం, గుజరాత్, మహారాష్ట్ర, బిహార్ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో పెంచే చేపలకు డిమాండ్ తగ్గింది. జనవరి వరకు ధర పెరగక పోవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరల తగ్గు ముఖంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2023-06-25T23:40:08+05:30 IST