ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలి

ABN, First Publish Date - 2023-09-26T00:23:59+05:30

స్పందనలో వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు.

దివ్యాంగుల వద్దకు వచ్చి గోడు వింటున్న కలెక్టర్‌

స్పందనలో 264 వినతులు స్వీకరణ

భీమవరం, సెప్టెంబరు 25: స్పందనలో వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించే విధంగా జిల్లా, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి 264 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణ వేణి, పంచాయతీ అధికారి మల్లిఖార్జునరావు,హౌసింగ్‌ పీడీ ఆనంద కుమార్‌, డీఎస్పీ శ్రీనాథ్‌ పాల్గొన్నారు. కొన్ని ఫిర్యాదులు ఇలా ఉన్నాయి..నాకున్న కొద్దిపాటి ఆస్తి నా కొడుకుకు రాశాను. బాగానే చూసేవాడు. అనారోగ్య కారణాలు వల్ల మరణించాడు.నా కోడలు కనీసం భోజనం కూడా పెట్టడం లేదు. న్యాయం చెయ్యాలంటూ నరసాపురం మండలం పెదమైన వాని లంక గ్రామానికి చెందిన తిరుమాని కనకరత్నం కోరింది. ఇళ్లలోని మురుగునీటిని పంట బోదెల్లోకి వదులుతున్నారని దీని వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిష్కార మార్గం చూపాలంటూ గణపవరం మండలం ముగ్గుళ్ళ గ్రామా నికి చెందిన రామచంద్రరావు కోరారు. డ్రెయినేజీ సమస్యతో మురుగునీరు పారడం లేదని రోగాల బారిన పడుతు న్నామని సమస్య పరిష్కరించాలని పాలకొల్లు మండలం తిల్లపూడి పాటిగరువుకు చెందిన దిడ్ల మాణిక్యాలరావు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-09-26T00:23:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising