ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-02-08T00:40:15+05:30

ప్రకృతి వైపరీత్యాలను ప్రజల భాగస్వామ్యంతోనే సమర్థవంతంగా ఎదుర్కొనగలమని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, ఫిబ్రవరి 7 : ప్రకృతి వైపరీత్యాలను ప్రజల భాగస్వామ్యంతోనే సమర్థవంతంగా ఎదుర్కొనగలమని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. భీమవరం కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో మంగళవారం ప్రకృతి విపత్తులను ఎదు ర్కొవడంపై అవగాహన, ముందస్తు చర్యలపై కలెక్టర్‌ ఎన్టీఆర్‌ఎఫ్‌ అధికారుల బృందంతో ఏర్పా టు చేసిన సమావేశంలో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు తక్షణం అక్కడి ప్రజలే స్పందించి ఎదు ర్కొనేలా అవగాహన ఉండాలన్నారు. జిల్లాలో ఆపద మిత్రలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి వారికి సంబంధిత సామగ్రిని అందజేస్తామన్నారు. నరసాపురం సబ్‌ కలెక్టర్‌ ఎం.సూర్యతేజ, డీఆర్వో కె.కృష్ణవేణి, ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందం కమాండర్‌ వై.సత్యనారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.

నేటి నుంచి అవగాహన సదస్సులు

ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందంచే ఈనెల 8వ తేదీన యలమంచిలి మండలం కనకాయలంక సచివాలయంలో ప్రజల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

9న భీమవరం డీఎన్నార్‌ కాలేజీలో సీబీపీ కార్యక్రమం

10వ తేదీ నరసాపురం మండలం పీఎం లంక జడ్పీ స్కూల్‌ ఆవరణలో స్కూల్‌ సేఫ్టీ కార్యక్రమం

11న నరసాపురం ఎంపీడీవో కార్యాలయం మీటింగ్‌ హాల్లో వలంటీర్లు, ఎన్‌వైకేఎస్‌లకు ఒక రోజు డీఎం శిక్షణ

13న యలమంచిలి మండలం పెదలంక పంచాయతీలో ప్రజలకు అవగాహన

14న భీమవరం ఇండస్ట్రీయల్‌ పార్కు సందర్శించి అక్కడ శిక్షణ

16న మొగల్తూరు మండలం కేపీ పాలెంలో స్కూల్‌ సేఫ్టీ ప్రోగ్రాం

17న ఆచంట మండలం అయోధ్యలంక మర్రిమాల ఎంపీ ఎలిమెంటరీ స్కూల్లో 10 గంట ల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలకు అవగాహన, మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు పాలకొల్లు బీఆర్‌ ఎమ్వీఎం హైస్కూల్‌ ఆవరణలో దివ్యాంగులకు అవగాహన

20న నరసాపురం మండలం వేములదీవి లోతట్టు ప్రాంతాన్ని, డామ్‌, నది ప్రాంతాన్ని సందర్శించి, గతంలో సంభవించిన విపత్తుల సమాచారాన్ని సేకరణ

21న మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్‌లో ప్రజలకు అవగాహన

ఆస్పత్రిలోనే ప్రసవాలు జరగాలి..

గ్రామాల్లో గర్భిణులకు ఆస్పత్రిలోనే ప్రసవాలు జరగాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి మంగళవారం మండలస్థాయి, పీహెచ్‌సీ స్థాయి వైద్యులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైరిస్కు గర్భిణులను వారం రోజులు ముందుగానే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిం చాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించాలని ఆదేశించారు.

Updated Date - 2023-02-08T00:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising