ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావుళ్లమ్మకు చాగంటి దంపతుల పూజలు

ABN, First Publish Date - 2023-03-04T00:01:57+05:30

మావుళ్ల మ్మ అమ్మవారిని శుక్రవారం ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు దంప తులు దర్శించుకుని పూజలు నిర్వహిం చారు.

ఆశీర్వచనాలు అందుకుంటున్న చాగంటి కోటేశ్వరరావు దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భీమవరం టౌన్‌, మార్చి 3 : మావుళ్ల మ్మ అమ్మవారిని శుక్రవారం ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు దంప తులు దర్శించుకుని పూజలు నిర్వహిం చారు. ఆలయానికి వచ్చిన వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా అశ్వత్ధగణపతికి పూజలు చేయించుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకోగా ఆలయ ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ పూజలు చేసి ఆశీర్వచనాలు అందించారు. దేవస్థానం తరపున శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందించారు. దేవస్థానం పాలకవర్గ చైౖర్మన్‌ మానేపల్లి నాగన్నబాబు, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భక్తితో దేనినైనా సాధించవచ్చని ఆంజనేయుడు నిరూపించారు..

భక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చని దానికి ఆంజనేయస్వామి ఆదర్శప్రా యుడని ఆధ్యాత్మిక ప్రవచకుడు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని ఆర్యవైవ్య వర్తక సంఘం భవనంలో శుక్రవారం రాత్రి హనుమద్వైభవంపై ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆంజనేయస్వామి భారీ రూపంగాను, సూక్ష్మరూపంలో కనిపించే ఆయన జ్ఞానం ముందు అందరం చిన్నావారేమనేనన్నారు. మనిషి ముక్తి పొందాలంటే మొదటిది సోపానం భక్తి ఒక్కటే మార్గమని అన్నారు. తమ కోసం కాకుండా పరోపకారం చేసి వారిలో ఇద్దరే ఇద్దరు ఉన్నారని వారిలో ఒకరు ఆంజనేయ స్వామి, మరొకరు ఆదిశంకరాచార్యులు అని వివరించారు.

Updated Date - 2023-03-04T00:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!