ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దిష్టిబొమ్మల్లా..

ABN, First Publish Date - 2023-09-23T00:21:55+05:30

నేరాలు చేధించడంలో నేడు సీసీ కెమెరా (క్లోజ్డ్‌ సర్య్కూట్‌)ల పాత్ర ఎంతో కీల కంగా మారింది.

ట్రామాకేర్‌ భవనం వద్ద పనిచేయని సీసీ కెమెరా

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేయని సీసీ కెమెరాలు

ఆస్పత్రిలో ఆవరణలో తరచూ బైకుల అపహరణ

ఏలూరు క్రైం, సెప్టెంబరు 22 : నేరాలు చేధించడంలో నేడు సీసీ కెమెరా (క్లోజ్డ్‌ సర్య్కూట్‌)ల పాత్ర ఎంతో కీల కంగా మారింది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారుల్లోనూ, ప్రధాన కూడళ్లలో, నగరాలు, పట్టణా ల్లోని ప్రధాన కూడళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ద్వారానే పర్యవేక్షణ చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వ్యాపార సంస్థలకు సూచిస్తున్నారు. ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఉండాలని పోలీసులు సూచించడంతో ఏలూరు ప్రభుత్వా స్పత్రిలోను గతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల ఏలూరు ప్రభుత్వాస్పత్రిని మెడికల్‌ కాలేజీ అను బంధ ఆస్పత్రిగా మార్చారు. 550 పడకల నుంచి 330 పడకలకు కుదించారు. ఆస్పత్రిలో 40 పైగా సీసీ కెమెరాలు ఉండగా వాటిని నిరంతరం సెక్యూరిటీ గార్డులు పర్యవేక్షిం చేవారు. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఆవరణలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యం లో భారీ వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలకు అనుబంధంగా ఉండే వైరు కట్‌ అయింది. పట్టించుకున్న నాథుడే కరువయ్యా డు. ఆస్పత్రి అధికారులే వీటి మరమ్మతులు నిర్వహించా ల్సి ఉంది. గతంలో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో ఉం డగా ఏ ఒక్క కెమెరా పనిచేయకపోయినా తక్షణం మర మ్మతులు చేయించేవారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఆవర ణలో ఏకంగా 19 మోటారు సైకిళ్లు అపహరణకు గుర య్యాయని కేసులు నమోదు కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రిలో సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశా రు. అవి పనిచేయడం లేదని తెలిసి నోటీసులు జారీ చేయ డంతో యుద్ధ ప్రాతిపధికన మరమ్మతులు చేయించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి బాగానే ఉన్నా ఈ ఏడాది ఏప్రిల్‌ 26 నుంచి మెడికల్‌ కాలేజీ అను బంధ ఆస్పత్రిగా పూర్తిస్థాయిలో కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం అత్యవసర విభాగం సమీపంలో శిశు మృత దేహం ఉండడంతో ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా రికా ర్డింగ్‌ ఉందేమోనని పరిశీలించగా అసలు ఆ కెమెరాయే పనిచేయడం లేదు. ఆస్పత్రి పార్కింగ్‌లోని ఒక ప్రైవేటు అంబులెన్సు అపహరణకు గురైనట్టు శుక్రవారం ఫిర్యాదు అందగా సీసీ కెమెరాలను పరిశీలించగా పనిచేయడం లేదు. సీసీ కెమెరాలు ఆస్పత్రి ఆవరణలో డాబుగా కనిపి స్తున్నాయే తప్ప ఏ ఒక్కటీ పనిచేయడం లేదు. నిత్యం వందలాది మంది ఆస్పత్రికి వస్తూనే ఉంటారు. వాహనా లకు, వస్తువులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ విభాగం పైనే ఉంది.

Updated Date - 2023-09-23T00:21:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising