ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెరిగిన మినుము ధరలు

ABN, First Publish Date - 2023-08-29T00:40:51+05:30

మినుముల ధరలు వారం రోజులుగా పెరగడంతో మినుములు పండించిన రైతుల మోములో ఆనందం వ్యక్తమవుతోంది.

క్వింటాలు ధర రూ.9 వేలు

ముదినేపల్లి రూరల్‌, ఆగస్టు 28 : మినుముల ధరలు వారం రోజులుగా పెరగడంతో మినుములు పండించిన రైతుల మోములో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం క్వింటాలు ధర రూ.9 వేలు ఉండడంతో పూర్తి స్థాయిలో గిట్టుబాటు అవుతోందని రైతులు పేర్కొంటున్నారు. అయితే మరోవైపు ఇప్పటికే సన్న, చిన్న కారు రైతులు తమ వద్ద ఉన్న మిను ములను తక్కువ ధరకే విక్రయించి నష్టపోయామని లబోదిబోమం టున్నారు. అకాల వర్షం కారణంగా మినుములు గుట్టల మీద ఉన్న తరుణంలో వర్షానికి తడిశాయి. దీంతో అధిక శాతం మంది రైతులు రంగు మారాయన్న ఆందోళనతో క్వింటాలు రూ.6 వేల నుంచి రూ.6,500 మధ్య విక్రయించి నష్టపోయారు. ముఖ్యంగా కౌలు రైతులు అయినకాడికి పంట అమ్ముకోవడంతో వారికి నష్టమే మిగిలింది. పెద్ద రైతులు వద్ద నిల్వ ఉన్న మినుములకు ధర దక్కుతుందని తాము మాత్రం ప్రతీ ఏడాది నష్టాలకు గురవుతున్నామని కౌలు రైతులు వాపోతున్నారు. మినుముల ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలకు మినుములు తడిచిరంగు మారడంతో ఉన్న మంచి మినుములకు డిమాండ్‌ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని ఎగుమతి దారులు చెబుతున్నారు. అయితే ధరలు ఇలాగే పెరిగితే విత్తనాలకు డిమాండ్‌ ఏర్పడి కొనలేని పరిస్థితి ఏర్పడుతుందని సన్న, చిన్నకారు రైతులు చెబుతున్నారు.

Updated Date - 2023-08-29T00:40:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising