ప్రజలకు విద్యుత్ బిల్లుల షాక్
ABN, First Publish Date - 2023-06-11T00:14:20+05:30
వైసీపీ పాలనలో విద్యుత్ బిల్లుల షాక్‌తో ప్రజలు విలవిల్లాడుతున్నారని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ విమర్శించారు.
కామవరపుకోట, జూన్ 10 : వైసీపీ పాలనలో విద్యుత్ బిల్లుల షాక్‌తో ప్రజలు విలవిల్లాడుతున్నారని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ విమర్శించారు. పాతూరులోని తన స్వగృహంలో శని వారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు తీర్చిదిద్దారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ కోతలు, విద్యుత్ బిల్లులు అధికమయ్యాయని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఏడుసార్లు విద్యుత్ ధరలు పెంచారని అన్నారు. రైతులకు సకాలంలో ప్రత్యక్ష నగదు చెల్లింపు చేయకుండా స్మార్ట్ మీటర్ల పేరుతో చేయాలనుకుంటున్న దోపిడీని ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరన్నారు. తెలుగుయువత మండల అధ్యక్షులు నూతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, టీడీపీ మేనిఫెస్టోను ఇంటింటికీ కరప త్రాల ద్వారా తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించి చంద్రబాబుకు ఓట్లు వేసే విధంగా చైతన్యపరుస్తామని అన్నారు. జిజ్జూరి బాబ్జీ, పసుమర్తి పార్ధసారధిబాబు, కొయ్యగూర వెంకటేష్, కొప్పిశెట్టి చిన్న, డోలా విజయ్, పాకలపాటి రవి, పామర్తి శేఖర్, బొబ్బిలి డాన్ దివాకర్ ఉన్నారు.
Updated Date - 2023-06-11T00:14:20+05:30 IST