ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుకు బీసీ నాయకుల సత్కారం

ABN, First Publish Date - 2023-06-03T00:29:10+05:30

టీడీపీ మహానాడులో బీసీల ప్రత్యేక రక్షణ చట్టం ప్రకటించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును జిల్లా బీసీ సంఘాల నాయకులు సత్కరించారు. శుక్రవారం మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబును సత్కరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ అంగర, శేషు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌/జంగారెడ్డిగూడెం టౌన్‌, జూన్‌ 2 : టీడీపీ మహానాడులో బీసీల ప్రత్యేక రక్షణ చట్టం ప్రకటించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును జిల్లా బీసీ సంఘాల నాయకులు సత్కరించారు. శుక్రవారం మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతోతో పాటు, రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి వెంకట నరసింహారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసరి శ్యామ్‌ చంద్రశేషు మాట్లాడుతూ బీసీల దశాబ్దాల పోరాటమే ఈ రక్షణ చట్టం అని, ఈ చట్టాన్ని వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి బీసీల ఆత్మ బంధువు అయ్యారని అన్నారు. బీసలకు ఇది ఎంతో గౌరవం అని ఎన్నటికీ మరచిపోలేని అంశం అన్నారు. బీసీలంతా సమష్టిగా పనిచేసి రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి బలిజ సాధికార కమిటీ అధ్యక్షుడు కుడిపూడి సత్తిబాబు, రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, చిటికెన రామలింగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి సత్యనారాయణ, పెచ్చెటి బాబు, నాగుల్‌ మీరా, చింతలపూడి పోలవరం పరిశీలకుడు కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

యువగళం పేరుతో స్టిక్కర్లు

పాలకొల్లు రూరల్‌, జూన్‌ 2 : రాష్ట్ర సమస్యలపై యువగళం పేరుతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర యువగళం స్టిక్కర్లు త్వరలో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులోకి రానున్నాయని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు. సెల్‌ ఫోన్ల వెనుక యువగళం స్టిక్కర్లను అతికిం చుకోవచ్చన్నారు. ఈ స్టిక్కర్లను రాజమ హేంద్రవరంలో జరిగిన మహానాడులో రాష్ట్రస్థాయి నాయకుల ఫోన్ల వెనుక అతికించుకున్నారని, త్వరలో దిగువస్థాయి నాయకులు, కార్యకర్తలకు అందు బాటులోకి వస్తాయన్నారు.

Updated Date - 2023-06-03T00:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising