పర్యావరణంపై అవగాహన ర్యాలీ
ABN, First Publish Date - 2023-06-02T23:43:42+05:30
ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరి రక్షణపై అవగాహన కలిగి ఉండాలని మునిసిపల్ కమి షనర్ ఎస్.శివరా మకృష్ణ అన్నారు.
పట్టణంలో సైకిల్ ర్యాలీ చేస్తున్న కమిషనర్ శివరామకృష్ణ, సిబ్బంది
భీమవరం, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరి రక్షణపై అవగాహన కలిగి ఉండాలని మునిసిపల్ కమి షనర్ ఎస్.శివరా మకృష్ణ అన్నారు. మేరా స్వచ్ఛ షెహర్ కార్యక్రమంలో భాగ ంగా శుక్రవారం సైకిల్ ర్యాలీ నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. పర్యావరణ కాలుష్యం వల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నాయని అన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ముందుగా జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సైకిల్ ర్యాలీని అసిస్టెంట్ కమిషనర్ జ్యోతి లక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు.
Updated Date - 2023-06-02T23:43:42+05:30 IST