ఆక్వా రైతుల సంక్షేమానికి కృషి
ABN, First Publish Date - 2023-07-10T00:33:01+05:30
రాష్ట్రంలో ఆక్వా రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్స్ సప్లయర్స్ అసోసియేషన్ (అప్స) రాష్ట్ర కమిటీ నాయకులు పేర్కొన్నారు.
భీమవరం జూలై 9: రాష్ట్రంలో ఆక్వా రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్స్ సప్లయర్స్ అసోసియేషన్ (అప్స) రాష్ట్ర కమిటీ నాయకులు పేర్కొన్నారు. అప్స కమిటీలో అధ్యక్షుడు, కోశాధికారి, ఇతర కీలక పదవులు పశ్చిమ గోదావరి జిల్లాకు లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అప్స అధ్యక్షుడు భీమాల శ్రీరామమూర్తి మాట్లాడుతూ, రొయ్యల కొనుగోలుదారులకు, ఎగుమతిదారులకు వారఽథిగా ఉంటు న్నది తామేనని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు రెండుసార్లు తాను అధ్యక్షుని గా వ్యవహరించి పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కోశాధికారి కామన రాంబాబు మాట్లాడుతూ, సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని గట్టెక్కించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి కోరా రామమూర్తి, కన్వీనర్ ముతకన పిచ్చయ్య, గౌరవ సలహాదారు తోట బోగయ్య, అసోసియేషన్ సభ్యులు పెన్నాడ శ్రీను, మట్ట నాగబాబు, బాబురావు ట్రేడర్ల సమస్యలను వివరించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా భీమాల శ్రీరామ్మూర్తి (భీమవరం), ఉపాధ్యక్షులుగా నడపన గణపతి (పాలకొల్లు), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కోరా రామ్మూర్తి (పెదఅమిరం), కోశాధికారిగా కామన రాంబాబు (భీమవరం), కన్వీనర్‌గా ముతకన పిచ్చయ్య (భీమవరం), సహాయ కార్యదర్శిగా పెన్నాడ శీను( భీమవరం) ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎన్నికయ్యారు.
Updated Date - 2023-07-10T00:33:01+05:30 IST