ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2023-01-24T23:59:08+05:30

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఫేస్‌యాప్‌ను రద్దు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

కైకలూరులో అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన

కైకలూరు, జనవరి 24 :కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఫేస్‌యాప్‌ను రద్దు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. మంగళవారం కైకలూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద కైకలూరులోని అంగన్‌వాడీ కార్యకర్తలు సీఐటీయూ మండల కార్యదర్శి కె.లాజర్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు ఒకటిని తక్షణమే రద్దు చేయాలని, సంపూర్ణ పోషణ మెనూ చార్జీలను పెంచాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెల్ఫేర్‌ ప్రమోషన్‌ వయోపరిమితి 50 ఏళ్లకు పెంచాలని ప్రమోషన్ల ప్రక్రియ లో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలన్నారు. ఆందోళన అనంతరం ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆందోళనలో ప్రాజెక్ట్‌ లీడర్‌ పి.సుజాత, యూనియన్‌ అధ్యక్షురాలు జి.ఝాన్సీరాణి, కార్యదర్శి కె.రమాదేవి, షేక్‌ అబిదాభేగం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:59:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising