ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బటన్‌ నొక్కినా సొమ్ము పడలే !

ABN, First Publish Date - 2023-07-21T00:25:23+05:30

అమ్మ ఒడి పథకం బటన్‌ నొక్కి దాదాపు 20 రోజలైంది. అయితే కొంత మంది తల్లుల ఖాతాలకు ఇంకా సొమ్ములు పడకపోడటంతో అధికారుల వద్దకు పరుగులు తీస్తు న్నారు. అమ్మఒడి సొమ్ములు పడని తల్లులు ప్రతిరోజూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

జిల్లాలో 1,43,534 తల్లులు..

ఇంకా చాలామందికి అమ్మ ఒడి రాలేదు ?

బ్యాంకులు, సచివాలయాల చుట్టూ ప్రదిక్షణలు

రేపు, మాపు అంటూ వలంటీర్ల మెసేజ్‌లు

భీమవరం రూరల్‌, జూలై 20 : అమ్మ ఒడి పథకం బటన్‌ నొక్కి దాదాపు 20 రోజలైంది. అయితే కొంత మంది తల్లుల ఖాతాలకు ఇంకా సొమ్ములు పడకపోడటంతో అధికారుల వద్దకు పరుగులు తీస్తు న్నారు. అమ్మఒడి సొమ్ములు పడని తల్లులు ప్రతిరోజూ ఆశగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకులకు వెళ్లి ఖాతాలను చెక్‌ చేసుకుంటు న్నారు. గతనెల చివరలో సీఎం బటన్‌ నొక్కారు. జిల్లాలో 2022–23 విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు 1,43,534 తల్లులకు రూ.215.30 కోట్లు తల్లుల ఖాతాలలో జమ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు కొంతమంది ఖాతాలలో సొమ్ముపడినా మరి కొంత మందికి ఇంకా సొమ్ము జమకాలేదు.

వలంటీర్ల మెసేజ్‌లు

అమ్మ ఒడిపై వలంటీర్లు మెసేజ్‌లు పెడుతున్నారు. నిన్నటివరకు చాలామందికి పడ్డాయి. మిగితవారికి కొద్ది రోజుల్లో పడతాయి.. కంగారు పడద్దంటూ సమాచారం ఇస్తున్నారు. సొమ్ములు పడకపోవటంతో తమను అనర్హులుగా గుర్తించారా అనే అనుమానాలు రావడంతో సచివాలయాలకు వెళ్తున్నారు. అక్కడ వారికి స్పష్టమైన సమచారం రాకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అమ్మఒడిగా తల్లులకు రూ.15 వేలు ఇస్తామని ఆర్భాటంగా చెప్పిన వైసీపీ ప్రభుత్వం పాఠశాలల మెయింటినేన్స్‌ అంటూ రూ. వెయ్యికి కోత పెట్టింది. రూ.14 వేలే ఇచ్చింది. ఇప్పుడు రూ.13 వేలే ఇస్తున్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా సొమ్ము కోసం కూడా నెలలు చూడాల్సి వచ్చింది. 25,878 గ్రూపులకు అందాల్సిన సొమ్ము రూ.266.67 కోట్లలో సగం సొమ్ము నెలకు మిగిలిన సొమ్ము మరో నెలకు వేశారు. రైతు భరోసా సొమ్ము జమ చేసేందుకు కూడా నెలలు పట్టాయి. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల పరిస్థితి కూడా ఇలాగే సాగింది.

Updated Date - 2023-07-21T00:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising