ఈ– పంట నమోదు నూరు శాతం చేయాలి
ABN, First Publish Date - 2023-07-21T23:56:59+05:30
ఈ–పంట నమోదు నూరు శాతం పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు
జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జేసీ రామ్‌సుందర్ రెడ్డి
భీమవరం, జూలై 21 : ఈ–పంట నమోదు నూరు శాతం పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ త్వరిత గతిన వరినాట్లు వేయించేలా రైతులను ప్రోత్సహిం చాలని సూచించారు. డ్రెయిన్లలో గుర్రపు డెక్క తొలగిం చాలన్నారు. రబీ ధాన్యం కొనుగోళ్లు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు చర్యలను చేపట్టాలని సివిల్ సప్లైస్ డీఎంను ఆదేశించారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పెండింగ్ నగదును వెంటనే చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ టి.శివరామప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 74 వేల 83 మంది రైతుల నుంచి 6.43 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు దీని నిమిత్తం 1,312 కోట్లుకు రూ.1,310 కోట్లు చెల్లించామన్నారు. మిగిలిన రెండు కోట్ల రూపాయలు రైతులు వారి బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ కాకపోవడంతో పెండింగ్‌లో ఉందన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు సంఘాని వడ్డికాసులు, జల వనరుల శాఖ ఈఈ దక్షిణామూర్తి, జల వనరుల అధికారి సుబ్రహ్మ ణ్యేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ, మత్స్యశాఖ అధికారి, ఉద్యానవన శాఖ అధికారి దుర్గేష్, ఏపీఎంఐపీ పీడీ వీరభద్రరావు, విద్యుత్ శాఖ అధికారి ఖాన్, వ్యవసాయ శాఖ ఏడీలు పాల్గొన్నారు.
విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం లేదు
–పెనుమత్స దుర్గా ప్రసాద్‌రాజు, సభ్యుడు
రొయ్యల మేత రేటు పెరిగిపోయింది. గిట్టుబాటు ధర రావడం లేదు. కొంతమంది ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందడం లేదు. ఆక్వా జోన్లో లేకపోతే విద్యుత్ రాయితీ ఇవ్వడం లేదు. మా ప్రాంతంలోనే ఐదు గ్రామాల్లో పూర్తిగా ఆక్వా సాగు చేస్తున్నారు.
ఆక్వా జోన్ ప్రకటించాలి
– కుటుంబరావు, సలహా మండలి సభ్యుడు
బేతపూడి, తుందుర్రు, చినగరువు, పెద్దగరువు ప్రాం తాల్లో సుమారు 450 ఎకరాలు ముంపుబారిన పడు తుండంతో వరిసాగు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం దాళ్వా పంట ఒక్కటే సాగు చేస్తున్నాం. మురుగు కాల్వకు ఆనుకొని ఆక్వా చెరువులు తవ్వడంతో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ఆక్వాజోన్‌గా ప్రకటించాలి
Updated Date - 2023-07-21T23:56:59+05:30 IST