పడుతూ..లేస్తూ!
ABN, First Publish Date - 2023-10-05T00:28:32+05:30
మండలంలో పలు ప్రధాన రహదారులు పెద్ద గొయ్యిలు పడి అధ్వానంగా మారడంతో లారీలు దిగబడుతున్నాయి.
దిగబడుతున్న లారీలు...వాహనాలు
కలిదిండి, అక్టోబరు 4 : మండలంలో పలు ప్రధాన రహదారులు పెద్ద గొయ్యిలు పడి అధ్వానంగా మారడంతో లారీలు దిగబడుతున్నాయి. గుర్వాయిపాలెం – కొత్తూరు, ప్రధా న రహదారి మూడు కిలోమీటర్ల మేర గొయ్యిలు పడడంతో కొద్దిపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్నాయి. వీటిలో తవుడు లోడు లారీలు దిగబడుతున్నాయి. మూల్లంక – పెదలంక ప్రధాన రహదారి ఆరు కిలోమీటర్ల మేర రహదారిని గోతులు పడి తారు కొట్టుకుపోయింది. కంకర రాళ్లు పైకి లేచాయి. ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే ప్రజలు నరక యాతన పడుతున్నారు. రహదారి మరమ్మతులు చేయకపోతే బస్సులను రద్దు చేస్తామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. చేపలు, రొయ్యల ఎగుమతులకు రవాణా సౌకర్యం సక్రమంగా లేక ఆక్వా రైతులు అవస్థలు పడుతు న్నారు. యడవల్లి – మట్టగుంట రహదారిపై పెద్ద గోతులు పడడంతో తవుడు లోడు లారీలు, చేపల లోడు వ్యాన్లు దిగబడుతున్నాయి. చెరువుల వద్దకు మేతలు లోడు వాహ నాలు వెళ్లకపోవడంతో కూలీల ఖర్చు అధికమవుతోందని వాపోతున్నారు. చినతాడినాడ – తాడినాడ వయా పోతుమర్రు, కలిదిండి ప్రధాన రహదారి 10 కిలోమీటర్ల మేర గోతులు పడడంతో లారీలతో పాటు వాహనాలు దిగబడుతున్నాయి. రహదారులకు మరమ్మతులు చేపట్టాలని టీడీపీ నాయకులు పలుమార్లు రహదారులు గుంతల వద్ద ఆందోళనలు చేపట్టినప్పటికీ పాలకులు స్పందించిన దాఖలాలు లేవు. రహదారుల నిర్మాణాలకు నిధులు మంజూరైనప్పటికీ బిల్లులు వస్తాయో లేవోనని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ విషయమై ఆర్ అండ్‌బీ డీఈఈ విజయశ్రీకర్‌ను వివరణ కోరగా ఆయా రహదారులకు నిధులు మంజూరయ్యాయని, టెండర్లు పూర్తి కాగానే నిర్మాణం చేపడతామన్నారు.
Updated Date - 2023-10-05T00:28:32+05:30 IST