పార్టీలకు ఓటర్ల జాబితా సమాచారం: మీనా
ABN, First Publish Date - 2023-07-21T03:13:01+05:30
ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన సమాచారాన్ని నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పక్షాలకు ప్రతివారం అందిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా అన్నారు.
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన సమాచారాన్ని నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పక్షాలకు ప్రతివారం అందిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా అన్నారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలతో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై గురువారం అమరావతి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈఆర్‌వోలు ప్రతివారం క్లెయిమ్‌లు, అభ్యంతరాల జాబితాలను రాజకీయ పార్టీలకు అందిస్తారని, దానినే సీఈవో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పారు. తొలుత ప్రత్యేక ఓటర్ల సవరణ షెడ్యూల్ వివరించిన మీనా... 2024 జనవరి 1 అర్హత తేదీగా నిర్ధారించామన్నారు. ఈ నెల 21 నుంచి బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా ఇంటింటి వెరిఫికేషన్ ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, కోనేరు సురేష్, వైసీపీ నుంచి ఏఎన్‌ఎన్ మూర్తి, వై. వెంకటేశ్వరరావు(బీజేపీ), వి.గురునాథం(సీపీఎం), వి.శ్రీనివాసరావు(కాంగ్రెస్) పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T03:13:01+05:30 IST