ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సారా కేసులో వైసీపీ కౌన్సిలర్‌ భర్త

ABN, First Publish Date - 2023-01-26T00:33:53+05:30

పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ నగర పంచా యతీలోని రెల్లివీధిలో భారీగా సారా పట్టుబడింది. ఈ ఘటనలో పాలకొండకు చెందిన వైసీపీ కౌన్సిలర్‌ భర్తపై కేసు నమోదైంది.

పట్టుబడిన సారాతో ఎస్‌ఈబీ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 350 లీటర్లు స్వాధీనం

- ‘మన్యం’ జిల్లాలో ఘటన

పాలకొండ రూరల్‌: పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ నగర పంచా యతీలోని రెల్లివీధిలో భారీగా సారా పట్టుబడింది. ఈ ఘటనలో పాలకొండకు చెందిన వైసీపీ కౌన్సిలర్‌ భర్తపై కేసు నమోదైంది. దీనిపై బు ధవారం ఎస్‌ఈబీ సీఐ ఎంవీ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సారా నిల్వలపై సమాచారంతో ఎస్‌ఈబీ సిబ్బంది పాలకొండలోని రెల్లివీధిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలో పిచ్చిమొక్కల మధ్య 35 క్యాన్లలో 350 లీటర్ల వరకు సారా లభ్యమైంది. కాగా ఈ సారా ఎవరు తీసుకొచ్చారన్న దానిపై ఆరా తీశారు. సీతంపేట మండలం నారాయణగూడకు చెందిన సవర భీముడును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనతో పాటు సవర ధర్మ, సవర బాపయ్యలు పాలకొండలోని రెల్లి వీధికి చెందిన ఆకుల కుమార్‌తో ఒప్పందం మేరకు సారా క్యాన్లను తీసుకొచ్చినట్టు చెప్పాడు. ఈ మేరకు పోలీసులు పాలకొండ రెండో వార్డు కౌన్సిలర్‌ (వైసీపీ) ఆకుల మల్లేశ్వరి భర్త ఆకుల కుమార్‌తో పాటు నలుగురిపై కేసులు నమోదు చేశారు. సారాను సీజ్‌ చేసి సవర భీముడిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఈబీ సీఐ తెలిపారు. మిగిలిన ముగ్గురిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు.

Updated Date - 2023-01-26T00:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising