ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమస్యలు పరిష్కారమయ్యేనా?

ABN, First Publish Date - 2023-09-23T00:08:15+05:30

విద్యాశాఖను సమస్యలు వేధిస్తోన్నాయి. నిధుల కొరతతో పలుచోట్ల నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వ జూనియర్‌ కళా శాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదు. పాఠశాల విద్యా ర్థులకు అం దించిన జగనన్న విద్యా కానుక కిట్లు నాణ్యతగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు

కలెక్టరేట్‌, సెప్టెంబరు 22: విద్యాశాఖను సమస్యలు వేధిస్తోన్నాయి. నిధుల కొరతతో పలుచోట్ల నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వ జూనియర్‌ కళా శాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదు. పాఠశాల విద్యా ర్థులకు అం దించిన జగనన్న విద్యా కానుక కిట్లు నాణ్యతగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంఈవో-2, కేజీవీబీ సిబ్బంది జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో శనివారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పర్యటించనున్నారు. ఆయన దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఫగంట్యాడ మండలం చినమానా పురం ప్రాథమిక పాఠశాలలో రెండో విడత నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. గదుల రిపేర్లు, మరుగుదొడ్లు, వాటర్‌, మేజర్‌ ఆండ్‌ మైనర్‌ పనులు, కిచిన్‌ షెడ్ల నిర్మాణం, విద్యుత్‌ వంటి 9 రకాల పనులకు రూ.11 లక్షలు కేటాయించారు. అయితే ఇంత వరకు రూ6.30 లక్షలు మాత్రమే విడుదలయ్యాయి. ఈ నిధులతో పనులు చేపట్టారు. మిగిలిన నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ఆగిపోయాయి. జి ల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో ఇదే సమస్య ఉంది. జిల్లాలో సుమారు రూ.18 కో ట్ల నిధులు మంజూరు కావాల్సి ఉందని అధికార లెక్కలు చెబుతున్నాయి. ఫ ఎం ఈవో-2లు బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు వారికి జీతాలు మంజూరు కాలేదు. ఎంఈవో-2కి డీడీవో ఎవరు అనేదాని పై ఇప్ప టికీ స్పష్టత లేకపోవడంతో వారు జీతాలకు నోచుకోవడం లేదు. ఫ బది లీల సందర్భంగా రీఎపోర్షన్‌లో ప్రధానోపాధ్యాయుల పోస్టులు రద్దు చేసి న ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, ప్రాథమిక, ప్రాతమికోన్నత పాఠశాల ల్లో అదనంగా కేటాయించిన సబ్జెక్టు టీచర్లకు జూన్‌, జూలై జీతాలు మంజూరు కాలేదు. ఆగస్టు నెల జీతాలు మాత్రం విడుదలయ్యాయి. ఫ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ)ల్లో పని చేస్తున్న టీచర్లు, నాన్‌ టీచింగ్‌ సి బ్బంది, సీఆర్‌పీలకు గత జూలై నుంచి జీతాలు అందడం లేదు. ఫమండల విద్యా శాఖ కార్యాలయాల్లో పని చేస్తున్న సీఆర్పీలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇతర సి బ్బంది కూడా జీతాల కోసం నిరీక్షిస్తున్నారు. ఫ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువు తున్న విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుంచి పాఠ్య పుస్తకాల పంపిణీ జరగడం లేదు. జగనన్న విద్యా కానుక కిట్లు నాణ్యతగా లేకపోవడంతో విద్యార్థులు కొత్తగా బ్యాగ్‌లు, బూట్లను కొనుగోలు చేసుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులకు అమ్మఒడి, విద్యాదీవెన అందలేదు.

Updated Date - 2023-09-23T00:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising