ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎందుకు ఆగిందంటే..

ABN, First Publish Date - 2023-03-26T00:31:08+05:30

పార్వతీపురంలోని ప్రధాన రహదారిలో ఈ బస్సు ఎందుకు ఆగిందని అనుకుంటున్నారా! ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చే టిమ్‌ మిషన్‌ మొరాయించడమే ఇందుకు కారణం.

ప్రధాన రహదారిలో ఆగిన పార్వతీపురం ఆర్టీసీ డిపో బస్సు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పార్వతీపురంలోని ప్రధాన రహదారిలో ఈ బస్సు ఎందుకు ఆగిందని అనుకుంటున్నారా! ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చే టిమ్‌ మిషన్‌ మొరాయించడమే ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే.. శనివారం ఉదయం 11.30 గంటలకు పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి విజయనగరానికి (ఏపీ 35 జడ్‌ 0004) బస్సు బయల్దేరింది. అయితే అక్కడి నుంచి వెళ్లిన పది నిమిషాలకే జిల్లా ఆసుపత్రి కూడలి దాటిన తర్వాత ఉన్నట్టుండి బస్సు ఆగిపోయింది. ఏదో మరమ్మతు కారణంగా బస్సు నిలిచిపోయిందని ప్రయాణికులు భావించారు. అయితే టిక్కెట్లు కొట్టే టిమ్‌ మిషన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడమేనని స్పష్టమైంది. కొద్దిసేపు ప్రధాన రహదారిపై బస్సును ఆపేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై డిపోమేనేజర్‌ దుర్గాను వివరణ కోరగా టిమ్‌ మిషన్‌ల మరమ్మతుల సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు. కాగా వివరణ కోరిన వెంటనే మరో బస్సును అక్కడకి పంపించి ప్రయాణికులను అందులో ఎక్కించారు.

- పార్వతీపురం టౌన్‌

Updated Date - 2023-03-26T00:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising