ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నదులు అనుసంధానం చేస్తే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం

ABN, First Publish Date - 2023-08-10T01:15:21+05:30

ఉత్తరాంధ్రలో ప్రధానమైన ఐదు నదులను అనుసంధానం చేస్తే రైతాంగం కరువుబారి నుంచి బయటపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

తోటపల్లి ప్రాజెక్టును పరిశీలిస్తున్న చంద్రబాబు

వైసీపీ వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌ పేరిట సర్వ నాశనం

తోటపల్లి ప్రాజెక్టును మేమే పూర్తి చేసినా.. నిర్వహణలో చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వం

కాలువల ఆధునికీకరణకు మేము రూ.రూ.180 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు

ఈ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మనసు కలచి వేస్తోంది

మేమొస్తే తోటపల్లి నుంచి పార్వతీపురానికి మంచినీరు ఇస్తాం

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

పార్వతీపురం(ఆంధ్రజ్యోతి)/గరుగుబిల్లి/కొమరాడ, ఆగస్టు 9: ఉత్తరాంధ్రలో ప్రధానమైన ఐదు నదులను అనుసంధానం చేస్తే రైతాంగం కరువుబారి నుంచి బయటపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తాము అధికారంలో ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టినా వైసీపీ సర్కార్‌ రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పూర్తిగా నాశనం చేసిందని ధ్వజమెత్తారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. తమ హయాంలో తోటపల్లి సాగునీటి ప్రాజెక్టును శంకుస్థాపన చేసి పూర్తి చేసినప్పటికీ ఈ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో కనీస నిర్వహణ బాధ్యతలను కూడా చేపట్టలేదని అన్నారు. ప్రాజెక్టు పరిధిలో 1.85 లక్షల ఎకరాలకు సాగునీరందేలా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం మారిన తరువాత కనీసం కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో పూడిక తొలగించలేని దుస్థితి వైసీపీ ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. తమ హయాంలో కాలువల ఆధునికీకరణకు రూ.180 కోట్లు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కడి పనులు అక్కడే విడిచిపెట్టిందని, ఇదేనా రైతాంగానికి చేసిన మేలు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 12 భారీ సాగునీటి ప్రాజెక్టులు, 69 చిన్ననీటి ప్రాజెక్టులు ఉన్నాయని, వీటిని పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకొనే బాధ్యత తాను తీసుకుంటానని రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తోటపల్లిని చూస్తే తన మనసు కలవరపడిందని, ఎంతో సస్యశ్యామలంగా ఉండవలసిన ప్రాజెక్టు నేడు అనాథలా కనిపించడం తన మనసును కలచివేసిందని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి వస్తే తోటపల్లి రిజర్వాయరు నుంచి పార్వతీపురానికి మంచినీరు ఇస్తామన్నారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా సాగునీకు కూడా ఇస్తామన్నారు. పార్వతీపురానికి ఉద్యానవన కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాలలను తామే మంజూరు చేసామన్నారు. జంఝావతి ప్రాజెక్టుకు తాము రూ.50 కోట్లు మంజూరు చేస్తే పనులు జరిపించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

జిల్లా కేంద్రంలో భారీ రోడ్‌షో

పార్వతీపురం /టౌన్‌, ఆగస్టు 9: జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణ సమీపంలో నవిరి కాలనీ నుంచి కొత్తవలస మీదుగా పాతబస్టాండ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోడ్‌ షో నిర్వహించారు. తోటపల్లి ప్రాజక్టు సందర్శన అనంతరం పార్వతీపురం పట్టణంలోకి వచ్చిన ఆయనకు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి హారతి ఇచ్చారు. మరోవైపు రహదారికి ఇరువైపులా బారులుదీరిన ప్రజలకు చంద్రబాబు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం పార్వతీపురం పాతబస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. ఈ రోడ్‌ షోలో టీడీపీ ముఖ్య నాయకులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు, బుద్దా వెంకన్న, కింజరాపు అచ్చెన్నానాయుడు, కిమిడి కళా వెంకటరావు, వైరిచర్ల కిషోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్‌, గుమ్మిడి సంధ్యారాణి, విజయరామరాజు, ద్వారపురెడ్డి జగదీష్‌, బోనెల విజయచంద్ర, పట్టణ మహిళలు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

విజయచంద్రను ఆశీర్వదించండి

పార్వతీపురం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియామకమైన బోనెల విజయచంద్రను ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు. వచ్చే ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలవాలన్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో పార్వతీపురం నియోజకవర్గ సమస్యలపై విజయచంద్ర ప్రస్తావించారు. టీడీపీ అధికారంలోకి రాగానే డంపింగ్‌యార్డు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా పార్వతీపురంలో చంద్రబాబు సభకు సుమారు 30 వేల మంది వచ్చారు.

చిన్నారి విరాళం

ఓ చిన్నారి తనతో పాటు సోదరుడు దాచుకున్న రూ.15 వేలను టీడీపీ విరాళంగా అందించడంతో చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నవయసులో విరాళంతో ఇలా ముందుకు రావడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని అన్నారు. చిన్నారులు, యువకులు, యువతలు, మహిళలు, వృద్ధులు అందరు పార్టీకి సంఘీభావం తెలుపుతుండడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన చంద్రబాబు

జిల్లాలోని పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, పాముల పుష్ణశ్రీవాణిలపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఆ ఎమ్మెల్యేలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

===================

సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు

చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో .మాజీ మంత్రులు కళావెంకటరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, శత్రుచర్ల విజయరామరాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన, మాజీ ఎమ్మెల్సీలు గుమ్మిడి సంధ్యారాణి, ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యేలు ఆర్పీ భంజ్‌దేవ్‌, ఎంఎస్‌ రాజు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణ , నాయకులు నందివాడ కృష్ణబాబు, వీరేష్‌, డొంకాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

===================

నేడు శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటన

పాలకొండ: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి పార్వతీపురంలో బస చేసిన ఆయన గురువారం ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వీరఘట్టం, పాలకొండ మీదుగా శ్రీకాకుళం చేరుకోనున్నారు. కాగా వీరఘట్టం, పాలకొండ మండలాల్లో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్దమవుతున్నారు. వీరఘట్టంలో అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద , పాలకొండలో కార్గిల్‌ జంక్షన్‌ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పాలకొండ, వీరఘట్టం మండలాల నాయకులు ఇప్పటికే ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.

===================

Updated Date - 2023-08-10T01:15:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising