ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుబయట ఎండలోనే.. రోగులకు చికిత్స

ABN, First Publish Date - 2023-06-03T00:37:43+05:30

పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందుతున్నారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోని అనేక గ్రామాలకు ఈ ఆసుపత్రే పెద్ది దిక్కు. నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. అయితే, ఇక్కడ పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

వరండాలో ఉండి వైద్య సేవలు పొందుతున్న రోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు, జూన్‌ 2: పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందుతున్నారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోని అనేక గ్రామాలకు ఈ ఆసుపత్రే పెద్ది దిక్కు. నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. అయితే, ఇక్కడ పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఈ ఆస్పత్రిలో పలువురు రోగులు ఆరుబయట ఎండలోనే మంచంపై వైద్య సేవలు పొందారు. దగ్గర మంచాలను వేసేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. పైగా ఎలాంటి ఫ్యాన్‌లు లేకపోవడంతో ఉక్కబోతతో అల్లాడారు. వారి సహాయకులు విసన కర్రలతో విసిరారు. రోగుల పరిస్థితిని చూసి అక్కడకు వచ్చే ప్రజలు చలించిపోయారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వేణుగోపాలరావును వివరణ కోరగా.. ‘‘ప్రస్తుతం ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. నిత్యం వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. రోగుల సంఖ్య పెరగడంతో పాటు మంచాలు వేసేందుకు కూడా స్థలం లేదు. అందుకే ఆరుబయట మంచాలు వేసి వైద్యం అందిస్తున్నాం.’’ అని తెలిపారు.

Updated Date - 2023-06-03T00:37:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising