ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రయాణ కష్టాలు

ABN, First Publish Date - 2023-06-26T23:50:07+05:30

భామినిలో బస్టాండ్‌ వద్ద విద్యార్థులు బస్సు ఎక్కేందుకు ఎలా పోటీపడుతున్నారో చూస్తున్నారుగా..! మళ్లీ వారికి ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి.

బస్సు ఎక్కేందుకు విద్యార్థుల అవస్థలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భామినిలో బస్టాండ్‌ వద్ద విద్యార్థులు బస్సు ఎక్కేందుకు ఎలా పోటీపడుతున్నారో చూస్తున్నారుగా..! మళ్లీ వారికి ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. వాస్తవంగా భామినిలో ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాల, జడ్పీ పాఠశాలలకు బత్తిలి వైపు నుంచి సుమారు 800 మంది విద్యార్థులు రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ రూట్‌లో బస్సులు తక్కువ. అవి కూడా సమయానికి రాకపోవడంతో విద్యార్థులకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. కొద్ది నెలలుగా ఒంటిపూట బడులు, ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు కావడంతో ఉపశమనం పొందిన వారికి సోమవారం నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రత్యేకంగా బస్సులు నడపకపోవడంతో ప్రమాదకర స్థితిలో విద్యార్థులు ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. కొందరు బాలికలు అంత రద్దీలో ఎక్కలేకపోతున్నారు. ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించలేక.. వేరే బస్సు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై పాలకొండ డీఎం టి.వెంకటరావును వివరణ కోరగా జిల్లాలో సీఎం పర్యటన ముగిసిన తర్వాత ప్రత్యేక బస్సు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- భామిని

Updated Date - 2023-06-26T23:50:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising