ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రిక్షాలో మృతదేహం తరలింపు

ABN, First Publish Date - 2023-06-26T23:54:02+05:30

పార్వతీపురంలోని జిల్లా కేంద్రాసుపత్రిలో చనిపోయిన ఓ వ్యక్తిని ఇలా రిక్షాలో ఇంటికి తరలించడం స్థానికులను కలిచివేసింది. బరువెక్కిన హృదయంతో చలించిపోయారు.

రిక్షాలో మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి)/పార్వతీపురంటౌన్‌ : పార్వతీపురంలోని జిల్లా కేంద్రాసుపత్రిలో చనిపోయిన ఓ వ్యక్తిని ఇలా రిక్షాలో ఇంటికి తరలించడం స్థానికులను కలిచివేసింది. బరువెక్కిన హృదయంతో చలించిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని వైకేఎం కాలనీకి చెందిన టి.కిషోర్‌ (34) అనారోగ్యం కారణంగా ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు ఆసుపత్రిలో చేరాడు. అయితే సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు మృతి చెందాడు. ఆ సమయంలో జిల్లాకేంద్రాసుపత్రిలో అంబులెన్స్‌లు లేవు. దీంతో కుటుంబ సభ్యులు రిక్షా ద్వారా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అసలు వైద్యాశాఖాధికారులు ఆదేశాల మేరకు జిల్లా కేంద్రాసుపత్రిలో మృతి చెందిన వ్యక్తులను వారి నివాసాలకు తీసుకెళ్లి బంధువులకు అప్పగిస్తుంటారు. అయితే అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులే అలా రిక్షాలో మృతదేహాన్ని తరలించారని అక్కడి వైద్యసిబ్బంది చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా అధికంగా మద్యం తాగడం వల్ల మృతుడు కిషోర్‌ కిడ్నీలతో పాటు అవయవాలన్నీ పాడైపోయాయని, అందుకే మృతి చెందాడని వైద్యుడు రవికుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-06-26T23:54:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising