ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పండగ పూట విషాదం

ABN, First Publish Date - 2023-09-20T00:19:13+05:30

చనిపోయిన బంధువు భౌతిక దేహాన్ని కడసారిగా చూసేందుకు ఆటోలో 8 మంది బయలుదేరారు. కొద్ది గడియల్లోనే వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పింది. ఒక్కసారిగా రహదారి నుంచి పక్కకు ఒరిగిపోయి పంట పొలాల్లోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పెదవేమలిలో వినాయకచవితి రోజున సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

మృతిచెందిన శ్రీను, (ఇన్‌సెట్‌లో) సత్యం(ఫైల్‌)

పండగ పూట విషాదం

ఆటో బోల్తా కొట్టి ఇద్దరి మృతి

పెదవేమలిలో చవితి రోజున ఘటన

గంట్యాడ, సెప్టెంబరు 18: చనిపోయిన బంధువు భౌతిక దేహాన్ని కడసారిగా చూసేందుకు ఆటోలో 8 మంది బయలుదేరారు. కొద్ది గడియల్లోనే వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పింది. ఒక్కసారిగా రహదారి నుంచి పక్కకు ఒరిగిపోయి పంట పొలాల్లోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పెదవేమలిలో వినాయకచవితి రోజున సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన వృద్ధురాలు జి.సింహాచలం సోమవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. పెదవేమలి గ్రామంలో ఉన్న ఆమె బంధువులు ఎనిమిది మంది సింహాచలం భౌతిక దేహాన్ని చివరిసారిగా చూసేందుకు ఆటోలో మధ్యాహ్నాం 3 గంటలకు బయలుదేరారు. పెదవేమలి నుంచి 200 మీటర్లు దాటాక ఉన్నఫలంగా ఆటో అదుపుతప్పింది. రెప్పపాటులో ఒకవైపు బోల్తాకొట్టింది. ప్రమాదంలో కిలపర్తి సత్యం(60), పి.శ్రీను(53), పి.సత్యవతితో పాటు కొండమ్మ తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా సత్యం, శ్రీను మృతిచెందారు. సత్యవతికి కాళ్లు విరిగిపోయాయి. గంట్యాడ ఎస్‌ఐ కిల్లారి కిరణ్‌ కుమార్‌ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్యంకు ఒక కుమారుడు మాత్రమే ఉన్నారు. ఆటో డ్రైవర్‌ పరారీలో ఉన్నారు.

Updated Date - 2023-09-20T00:19:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising