ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇది జగనన్న కాలనీ దారి

ABN, First Publish Date - 2023-07-21T00:06:54+05:30

రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కంచరాం సమీపంలో జగనన్న కాలనీకి వెళ్లే దారిది. అక్కడ 1500 పైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రభుత్వం కనీస సౌకర్యమైన రోడ్డును పూర్తి చేయలేకపోతోంది. దీంతో ఇళ్ల నిర్మాణ సామగ్రి తరలించడానికి పేదలు అనేక అవస్థలు పడుతున్నారు.

ఇది జగనన్న కాలనీ దారి

రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కంచరాం సమీపంలో జగనన్న కాలనీకి వెళ్లే దారిది. అక్కడ 1500 పైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రభుత్వం కనీస సౌకర్యమైన రోడ్డును పూర్తి చేయలేకపోతోంది. దీంతో ఇళ్ల నిర్మాణ సామగ్రి తరలించడానికి పేదలు అనేక అవస్థలు పడుతున్నారు. ఆ ఇబ్బందులకు విసుగుచెంది కొందరు నిర్మాణ పనులు ఆపేశారు. తాజా వర్షాలకు ద్విచక్ర వాహనం కూడా వెళ్లే పరిస్థితి లేదు. అక్కడి పరిస్థితిని స్థానిక అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లాక కంచరాం గ్రామం నుంచి రహదారి నిర్మాణానికి రూ2.05 కోట్లు మంజూరు చేశారు. కాంట్రాక్టర్‌కు పనులు కూడా అప్పగించారు. ఆయన మట్టి పనులు మాత్రమే చేసి వదిలేశారు. దీంతో పేరుకే రహదారి అన్నట్లు పరిస్థితి తయారైంది. ఈ విషయాన్ని ఏఈ ఆనందరావు వద్ద ప్రస్తావించగా మట్టి కొంచెం కిందకి దిగాక గ్రావెల్‌, మెటల్‌ వేస్తామని, అంతవరకు ఇబ్బందులు తప్పవని అన్నారు.

- రాజాం

Updated Date - 2023-07-21T00:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising