ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘హాస్టల్‌ను వదిలి వెళ్లేది లేదు’

ABN, First Publish Date - 2023-07-21T00:12:22+05:30

తాము హాస్టల్‌ను వదిలి వెళ్లేది లేదని కొత్తవలస పోలీసు స్టేషన్‌ సమీపంలోనున్న ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు ఖరాఖండిగా తేల్చి చెప్పారు. గురువారం సాయంత్రం ఈ హాస్టల్‌ భవనాన్ని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ పీడిక రత్నం సందర్శించారు.

కొత్తవలస, జూలై 20: తాము హాస్టల్‌ను వదిలి వెళ్లేది లేదని కొత్తవలస పోలీసు స్టేషన్‌ సమీపంలోనున్న ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు ఖరాఖండిగా తేల్చి చెప్పారు. గురువారం సాయంత్రం ఈ హాస్టల్‌ భవనాన్ని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ పీడిక రత్నం సందర్శించారు. కొత్తవలస-కె.కోటపాడు రోడ్డులోని ఆంజనేయపేటలో బీసీ బాలికల వసతి గృహం ఉంది. ఈ వసతి గృహం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో జడ్పీ హైస్కూల్‌కు బాలికలు నిత్యం నడుచుకుంటూ వెళ్లి తిరిగి వస్తుంటారు. హాస్టల్‌ నుంచి హైస్కూల్‌కు ప్రతి నిత్యం ఎండలో వెళ్లి రావడం, వర్షం వస్తే తడిసి రావడం ఇబ్బందిగా ఉందని తెలిపారు. తమ స్కూల్‌కు దగ్గరలో వసతి గృహం ఉండేలా చూడాలని వేడుకున్నారు. అప్పట్లో అధికారుల దృష్టి ఎస్సీ బాలుర వసతి గృహంపై పడింది. దీంతో ఇక్కడి విద్యార్థులను ఆంజనేయపేటలోనున్న వసతి గృహానికి పంపించి... అక్కడి బాలికలను ఇక్కడికి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్సీ విద్యార్థులు అందుకు అంగీకరించడం లేదు. గురువారం సాయంత్రం డీడీ పీడిక రత్నం వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు ససేమిరా అనడంతో బీసీ బాలికల వసతి గృహాన్ని ఎక్కడికి తరలించాలా అని అధికారులు తర్జభర్జన పడుతున్నారు.

Updated Date - 2023-07-21T00:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising