వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం
ABN, First Publish Date - 2023-09-04T00:18:04+05:30
ఒక్క అవకా శం ఇవ్వండి అన్నివి ధాలుగా అభివృద్ధి చేస్తామ ని ప్రజల ను నమ్మించిన వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చే సిందని రాజాం నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీ మోహన్ ఆరోపించారు. ఆదివారం పొగిరిలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు సుమల జగన్మోహన్‌రావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఆయన్ను పరామర్శించారు
రాజాం: ఒక్క అవకా శం ఇవ్వండి అన్నివి ధాలుగా అభివృద్ధి చేస్తామ ని ప్రజల ను నమ్మించిన వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చే సిందని రాజాం నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీ మోహన్ ఆరోపించారు. ఆదివారం పొగిరిలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు సుమల జగన్మోహన్‌రావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ విలేక రులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే వాటిని ఆక్రమించు కోవడం తప్ప అభివృద్ధి వైపు దృష్టి పెట్టలేదన్నారు. ఏ ప్రభుత్వ పాలనలో లేన విధంగా సెప్టెంబరులో విద్యుత్ కోతలు విధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు న్నారని ఆరోపించారు. జగన్ రెడ్డిని సాగనంపడానికి టీడీపీ అధినేత అన్నివిధాలుగా కృషి చేస్తున్నారని, ఇందుకు ప్రజలు సహకరించాలన్నారు. వైసీపీ మాయమాటలు నమ్మి మళ్లీ మోస పోవద్దన్నారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు గురవాన నారా యణరావు, టంకాల కన్ననాయుడు, రగమండల గణపతినాయుడు, మడ్డు హరి, అడపా శ్రీను, కెల్ల వెంకటరమణ పాల్గొన్నారు. ఫరాజాంలోని గడుదల సూరిబాబు కుమార్తె యోచిత వివాహం పురస్కరించుకొని రూ. 60 వేల నగదు, ఐదు చీరలు, బియ్యం బస్తాను కోండ్రు మురళి అందజేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు నంది సూర్య ప్రకాష్, ప్రధాన కార్యదర్శి శేషపు రమేష్, పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు గురవాన నారాయణరావు, టంకాల కన్నంనాయుడు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-04T00:18:04+05:30 IST