ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీసీసీబీని వీడని అవినీతి మరక

ABN, First Publish Date - 2023-03-18T01:08:44+05:30

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో అక్రమాలు మరోమారు వెలుగుచూశాయి. రామభద్రపురం శాఖలో ఏకంగా రూ.1.4 కోట్లు పక్కదారి పట్టినట్టు శాఖపరమైన దర్యాప్తులో తేలింది. దీనికి బాధ్యులుగా చేస్తూ మేనేజర్‌ మదన్‌తో పాటు ఐదుగురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. గత కొద్దిరోజులుగా ఈ బ్రాంచ్‌పై అనేక ఆరోపణలున్నాయి.

రామభద్రపురం డీసీసీబీ శాఖ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

డీసీసీబీని వీడని అవినీతి మరక

రామభద్రపురంలో రూ.1.4 కోట్లు గోల్‌మాల్‌

బ్యాంక్‌ సిబ్బందే సూత్రధారులు

మేనేజర్‌తో పాటు ఐదుగురిపై సస్పెన్షన్‌ వేటు

రికవరీ చేస్తాం : సీఈవో జనార్దనరావు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో అక్రమాలు మరోమారు వెలుగుచూశాయి. రామభద్రపురం శాఖలో ఏకంగా రూ.1.4 కోట్లు పక్కదారి పట్టినట్టు శాఖపరమైన దర్యాప్తులో తేలింది. దీనికి బాధ్యులుగా చేస్తూ మేనేజర్‌ మదన్‌తో పాటు ఐదుగురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. గత కొద్దిరోజులుగా ఈ బ్రాంచ్‌పై అనేక ఆరోపణలున్నాయి. తొలుత రూ.2.10 కోట్లు దుర్వినియోగం అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ రూ.1.4 కోట్లుగా అధికారులు నిగ్గుతేల్చారు. ఈ అక్రమాల పర్వంలో సిబ్బంది పాత్ర బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. వారు సొంత ఖాతాలకు నిధులు మళ్లించుకున్నారు. అయితే ఖాతాదారుల అకౌంట్స్‌ నుంచి కాకుండా బ్యాంక్స్‌ హెడ్స్‌ ఖాతాల నుంచి మళ్లించడంతో అక్రమాలు వెలుగులోకి రావడం ఆలస్యమైంది. కంచే చేను మేసిన చందంగా ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులే అక్రమాలకు పాల్పడుతుండడంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు.

ఫ గతంలో చాలాసార్లు..

డీసీసీబీకి అవినీతి మరక వదలడం లేదు. గతంలో కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఐదేళ్ల కిందట రావివలస బ్రాంచ్‌లో భారీగా అవకతవకలు వెలుగుచూశారు. అప్పట్లో ఉన్నతస్థాయి దర్యాప్తు సైతం కొనసాగింది. డీసీసీబీలో రాజకీయ జోక్యం అధికం. అటు పాలకపక్షం పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో బినామీ రుణాలు, నిధుల దారి మళ్లింపు, వ్యక్తిగత అవసరాలకు సర్దుబాటు వంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. గతంలో వెలుగుచూసిన ఘటనలన్నీ ఈ అంశాలతో కూడుకున్నవే. అయితే ఈసారి రామభద్రపురం బ్రాంచ్‌లో అవకతవకల వెనుక సిబ్బంది ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో థర్డ్‌ పార్టీ ప్రమేయం లేదని బ్యాంక్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈఘటన విషయమై డీసీసీబీ సీఈవో జనార్దనరావు మాట్లాడుతూ రూ.1.4 కోట్లు పక్కదారి పట్టడం నిజమేనని చెప్పారు. బాధ్యులపై సస్పెన్షన్‌ వేటు వేసినట్టు చెప్పారు. నిధుల రికవరీకి చర్యలు తీసుకుంటామని.. వారు ముందుకు రాకుంటే మాత్రం ఆస్తులను రికవరీ చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-03-18T01:08:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising