పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేయాలి
ABN, First Publish Date - 2023-01-15T00:05:24+05:30
పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు సూచించారు.
రాజాం: పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు సూచించారు. రాజాంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాఽధ్యక్షుడు రావాడ సీతారాం, రణస్థలం మండల నాయకులు కలిసి భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళా వెంకటరావు మాట్లాడుతూ వైసీపీ ప్ర భుత్వం పాలనలో పూర్తిగా విఫలమ య్యిందని ఆరోపించారు. ప్రజలు జగన్ పాలనపై విసుగుచెందారన్నారు. పార్టీ జాతీ య అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న ఇదేం ఖర్మ-మన రాష్ట్రాని కార్యక్రమానికి ప్రజలు తరలిరావడం చూసి ఓర్వలేకనే బ్రిటీష్ పాలన నాటి జీవోలను తీసుకొస్తున్నారని ఆరోపించారు. గొలివి గోవిందరావు, లండ వెంకటరావు, కోరాడ అప్పారావు, రాకోటి తిరుమలరావు, విశ్రాంత ఆర్డీవో రెడ్డి గున్నయ్య పాల్గొన్నారు.
Updated Date - 2023-01-15T00:05:25+05:30 IST