ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆక్సైడ్‌ పరిశ్రమను కొనసాగించాలి

ABN, First Publish Date - 2023-09-26T00:02:44+05:30

దువ్వాం పంచా యతీ డీఎఫ్‌ఎన్‌లో ఉన్న ఆక్సైడ్‌ పరిశ్రమ మూసివేత నిర్ణయంపై కార్మికులు గళం విప్పారు.

గరివిడి: దువ్వాం పంచా యతీ డీఎఫ్‌ఎన్‌లో ఉన్న ఆక్సైడ్‌ పరిశ్రమ మూసివేత నిర్ణయంపై కార్మికులు గళం విప్పారు. పరిశ్రమ మూయ వద్దని కోరుతూ సోమవారం గరివిడిలో నిరసన ర్యాలీ చేసి, స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. డీఎఫ్‌ఎన్‌ ఆక్సైడ్‌ పరిశ్రమలో 110 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమ మూసివేసేందుకుగాను యాజమాన్యం ప్రభుత్వ అనుమతికి దరఖాస్తు చేసింది. దీంతో కార్మిక లోకం వీధికెక్కింది. సీఐటీయూ డివిజన్‌ కమిటీ నాయకులు అంబళ్ల గౌరునాయుడు, జంపాన విశ్వనాథరాజుల ఆధ్వర్యంలో కార్మికులు గరివిడి రైల్వే వంతెన దిగువ నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌ టి.గోవింద్‌కి వినతిపత్రం అందించారు. పరిశ్రమ మూసివేస్తే తమ బతుకులు బజారున పడతాయని శ్రమ జీవులు వేడుకున్నారు. పరిశ్రమ మూసివేతకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదని వారు విన్నవించుకున్నారు.

Updated Date - 2023-09-26T00:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising