ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వేలైన్‌ పేరు.. ఉద్దేశం వేరు

ABN, First Publish Date - 2023-02-06T23:16:42+05:30

జిల్లాలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పటి వరకూ ఇసుకపై దృష్టిపెట్టిన మాఫియా మరింత తెగబడుతోంది. మట్టి, గ్రావెల్‌ తరలించుకోపోయి సొమ్ము చేసుకుంటోంది. గత నెల రోజులుగా బొడ్డవర-కిల్తంపాలెం పంచాయతీ పరిధిలోని జిల్లేడిలోవా సమీపంలో పదుల ఎకరాల్లో ఉన్న డీ పట్టా భూముల్లో గ్రావెల్‌ తరలించుకుపోతున్నారు.

యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేలైన్‌ పేరు.. ఉద్దేశం వేరు

డీ పట్టా భూముల్లో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు

రైల్వేలైన్‌ నిర్మాణానికి అంటూ వాదన

అనుమతులు ఇవ్వలేదంటున్న అధికారులు

(శృంగవరపుకోట రూరల్‌)

జిల్లాలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పటి వరకూ ఇసుకపై దృష్టిపెట్టిన మాఫియా మరింత తెగబడుతోంది. మట్టి, గ్రావెల్‌ తరలించుకోపోయి సొమ్ము చేసుకుంటోంది. గత నెల రోజులుగా బొడ్డవర-కిల్తంపాలెం పంచాయతీ పరిధిలోని జిల్లేడిలోవా సమీపంలో పదుల ఎకరాల్లో ఉన్న డీ పట్టా భూముల్లో గ్రావెల్‌ తరలించుకుపోతున్నారు. యంత్రాలతో తవ్వి భారీ వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడున్న వారిని ప్రశ్నిస్తే రైల్వేలైన్‌కు అని సమాధానం చెబుతున్నారు. పెద్దపెద్ద కాంట్రాక్ట్‌ పనులు కావడంతో అనుమతులు అవసరం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. గతంలో రైల్వేలైన్‌ పేరిట యంత్రాలతో గ్రావెల్‌ తరలించినప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన అధికారులు సంబంధిత వ్యక్తులను పిలిచి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కొద్దికాలం తరలింపు నిలిచిపో యింది. ఇప్పుడు మళ్లి తవ్వకాలతో పాటు రవాణా మొదలుపెట్టారు. రోజుకు పదుల సంఖ్యలో వాహనాల రాకపోకలతో రహదారులు పాడవుతున్నాయని సమీప గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. దీనిపై వీఆర్వో కృష్ణ వద్ద ప్రస్తావించగా గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి లేదన్నారు. పరిశీలించి ఉన్నతాధికా రులకు నివేదిస్తామని చెప్పారు. దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - 2023-02-06T23:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising