ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి చూపిన యంత్రమే ఉసురు తీసింది..

ABN, First Publish Date - 2023-01-11T00:00:51+05:30

వరినూర్పుడు పనులకు రోజులాగే మంగళవారం ఉదయం మహిళా కూలీలంతా సరదాగా బయలుదేరారు. జానపద గీతాలు పాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. రెప్పపాటులో మహా కుదుపు సంభవించింది. వారు కూర్చొన్న నూర్పిడియంత్రం ఉన్నట్టుండి బోల్తా కొట్టింది. అప్పటివరకు పాటలు పాడిన నోటే హాహాకారాలు వినిపించాయి.

ప్రమాదానికి కారణమైన వరి నూర్పుడి యంత్రం, ఇన్‌సెట్‌లో గోర్జి తిరుపతమ్మ (ఫైల్‌), పోల లక్ష్మణమ్మ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూర్పుడి యంత్రం బోల్తా పడి ఇద్దరు కూలీల దుర్మరణం

మరో ఇద్దరికి గాయాలు

బొబ్బిలి, జనవరి 10: వరినూర్పుడు పనులకు రోజులాగే మంగళవారం ఉదయం మహిళా కూలీలంతా సరదాగా బయలుదేరారు. జానపద గీతాలు పాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. రెప్పపాటులో మహా కుదుపు సంభవించింది. వారు కూర్చొన్న నూర్పిడియంత్రం ఉన్నట్టుండి బోల్తా కొట్టింది. అప్పటివరకు పాటలు పాడిన నోటే హాహాకారాలు వినిపించాయి. చుట్టుపక్కల వారు వచ్చి సపర్యలు చేసినా యంత్రం బరువుకు ఊపిరి అందక ఇద్దరు మహిళలు ప్రాణాలు వదిలారు. రెప్పపాటులో ఆ ప్రాంతం కన్నీటి సంద్రమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బొబ్బిలి మండలం గొంగాడవలస పంచాయతీ శివారు గ్రామం అన్నంనాయుడువలసకు చెందిన మహిళా కూలీలు పొరుగున ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జానుమల్లువలస గ్రామంలో వరి పంటనూర్పుడు పనులకు మంగళవారం ఉదయం బయలుదేరారు. ట్రాక్టర్‌తో పాటు ఉన్న నూర్పిడి యంత్రంపై వారంతా కూర్చొని ప్రయాణిస్తున్నారు. కొంతదూరం వెళ్లాక ఓ పొలంగట్టు దాటుతుండగా నూర్పిడియంత్రం అదుపుతప్పి బోల్తా పడింది. గోర్జి తిరుపతమ్మ (50), పోల లక్ష్మణమ్మ (38)లు యంత్రం కిందివైపు చిక్కుకుపోవడంతో ఆ బరువుకు ఊపిరి అందలేదు. దీంతో ఘటనా స్థలంలోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. గేదెల శ్రీదేవి, మడక సత్యవతిలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 అంబులెన్స్‌లో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచనతో విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు గ్రామానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గోర్జి తిరుపతమ్మ భర్త ఇటీవలే మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పోల లక్ష్మణమ్మకు భర్త శ్రీరాములు, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Updated Date - 2023-01-11T00:00:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising