ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన జాతర

ABN, First Publish Date - 2023-01-26T00:35:32+05:30

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతర బుధవారం అంపకోత్సవంతో ముగిసింది.

గ్రామంలో ఘటాలను ఊరేగిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలమాంబకు ప్రత్యేక పూజలు

అమ్మవారి దర్శనానికి బారులుదీరిన భక్తులు

సాలూరు రూరల్‌/మక్కువ,జనవరి 25: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతర బుధవారం అంపకోత్సవంతో ముగిసింది. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఘటాలను గ్రామంలో తిరువీధితో చదురు గుడి నుంచి వనం గుడికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో దారి పొడవునా భక్తులు చీరలను పరిచారు. ఘటాలకు ప్రత్యేక పూజలు చేశారు. పాల జంగిడిని మోయడానికి మహిళలు పోటీ పడ్డారు. పోలమాంబ జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం ముగియడంతో చివరి రోజు అంపకోత్సవం సందర్భంగా గ్రామస్థులు మొక్కుబడులు చెల్లించారు. బంధువులు, స్నేహితులకు విందులు ఏర్పాటు చేశారు. మొత్తంగా గ్రామంలో ప్రతి ఇల్లు సందడిగా మారింది. వివిధ దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. జాతర విజయవంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

చదురుగుడికి భక్తుల తాకిడి

అంపకోత్సవం పురస్కరించుకుని శంబర పోలమాంబ చదురుగుడికి మూడోరోజు కూడా భక్తులు పోటెత్తారు. సిరిమానోత్సవం రోజున దర్శనానికి రాలేని సుదూర ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కోళ్లు, చీరలతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవాదాయ శాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22 నుంచి 24 వరకు 6 లక్షల 60 వేల 566 రూపాయలు ఆదాయం వచ్చినట్టు ఈవో వి.రాధాకృష్ణ తెలిపారు. ఈనెల 31న మారుజాతర జరగనుందని చెప్పారు.

Updated Date - 2023-01-26T00:35:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising