ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 నాటికి ఉపాధ్యాయ బదిలీలు పూర్తి

ABN, First Publish Date - 2023-06-02T23:59:31+05:30

ss

రేగిడి: సమావేశంలో మాట్లాడుతున్న లింగేశ్వరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెర్లాం (బొబ్బిలి): జిల్లాలో ఈనెల 12 నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి చెప్పారు. శుక్రవారం బొబ్బిలిలోని ఎస్‌ఎస్‌ఎస్‌ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలను ప్రదర్శించి ఈనెల 12 నాటికి బదిలీలు పూర్తిచేస్తామని చెప్పారు. పారదర్శకంగా బదిలీలు చేస్తా మన్నారు. జగనన్న విద్యా దీవెన కిట్లు ఇప్పటికి 62 శాతం వచ్చాయని, 12 నాటికి పూర్తిస్థాయిలో వస్తాయన్నారు. ఈ నెల 12లోగా నాడు-నేడు రెండో విడత పనులలో విద్యుత్‌, మరుగుదొడ్లు, వంట గదుల నిర్మాణం పూర్తిచేశామన్నారు. జిల్లాలో 737 పాఠశాలలకు నాడు-నేడు రెండో విడత పనులకు రూ.230 కోట్లు మంజూరయ్యాయ ని, ఇప్పటికి రూ.76కోట్లు ఖర్చు చేశామన్నారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశా లల్లో చేర్పించాలని తల్లిదం డ్రులను కోరారు. ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాన్ని పెం చేందుకు మూడు విడతలుగా 1998,2008, 2018 డీఎస్సీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో తిరుపతినాయుడు, ఎంఈవో లక్మణరావు పాల్గొన్నారు.

నాడు-నేడు పనులు పూర్తి చేయాలి

రేగిడి: పాఠశాలల్లో నాడు-నేడు ఫేజ్‌- 2 కింద గుర్తించిన టెన్‌ కంపోనెంట్‌ పనులు ఈనెల 12లోగా పూర్తిచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వర్‌రెడ్డి ఆదే శించారు. శుక్రవారం స్ధానిక మండలపరిషత్‌కార్యాలయ మందిరంలో నాడు-నేడు ఫేజ్‌-2 పనులపై ఇంజినీరింగ్‌ సిబ్బంది, హెచ్‌ఎంలతో సమీక్షించారు.కార్యక్రమంలో ఎంఈవో వరప్రసాదరావు, డీఈఈ మురళీమోహనరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising