టీడీపీ అధికారంలోకి రావడమే లక్ష్యం
ABN, First Publish Date - 2023-01-17T00:02:59+05:30
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ము ఖ్యమంత్రిగా చేసే వరకు గ్రామాల్లో ఉండే నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని టీడీపీ నేత గొంప కృష్ణ అ న్నారు.
శృంగవరపుకోట రూరల్: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ము ఖ్యమంత్రిగా చేసే వరకు గ్రామాల్లో ఉండే నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని టీడీపీ నేత గొంప కృష్ణ అ న్నారు. సోమవారం మం డలంలోని మామిడిపల్లి గ్రామంలో నిర్వహించిన గంగమాంబపేరంటాలు తీర్థానికి ఆయన హాజరై గ్రామంలోని ముఖ్యనాయకులను పలకరించారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధా నాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు గోరంత ఇచ్చి కొండంత పన్నులు దోచుకుంటున్న విధానాన్ని వివరించాలని సూచించారు. చంద్రబాబునాయుడు ఆవశ్యకతను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ విశాఖపార్లమెంటరీ ఉపా ధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్, మండలపార్టీ కార్యదర్శి జుత్తాడ రామసత్యం, గోపాలపల్లి సర్పంచ్ అడారి మహేశ్వరరావు, ఎస్.కోట మాజీ వార్డుసభ్యుడు ఎం.మంగరాజు, గ్రామటీడీపీ నాయకుడు త్రినాథ్, గ్రామ యువత ఉన్నారు.
Updated Date - 2023-01-17T00:03:00+05:30 IST