ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ సంఘీభావ పాదయాత్ర

ABN, First Publish Date - 2023-05-14T00:17:05+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం నాటికి వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 15న జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల కేంద్రాల నుంచి ఏడు కిలోమీటర్ల మేర సంఘీభావ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

మాట్లాడుతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొలిట్‌బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి వెల్లడి

విజయవంతం చేయాలని పిలుపు

పార్వతీపురం, మే13 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం నాటికి వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 15న జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల కేంద్రాల నుంచి ఏడు కిలోమీటర్ల మేర సంఘీభావ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో చేపట్టనున్న పాదయాత్రలో పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జీవో-1 రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఇప్పటివరకు సీఎం జగన్‌ పరామర్శించకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. వివిధ జిల్లాల్లో జగన్‌ పర్యటన సందర్భంగా పచ్చని చెట్లును నరికివేయడం తగునా అని ఆమె ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. తగిన సమయంలో ఓటు ద్వారా బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ మాట్లాడుతూ.. కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనమని చెప్పారు. ఏపీలోనూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో అది పునరావృతం కానుందని, వైసీపీ ఓటమి ఖాయమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ డి.శ్రీదేవి, టీడీపీ నాయకులు కోలా వెంకటరావు, జి.రవికుమార్‌, డి.మోహన్‌, కె.తిరుపతిరావు, దేవి, చంద్రమౌళి, భాస్కర్‌, ప్రదీప్‌, గౌరునాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, రవి, ఉదయ్‌భాను, లక్ష్మణరావు, మధుసూదనరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-14T00:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising