వివాహిత అనుమానాస్పద మృతి
ABN, First Publish Date - 2023-09-23T00:11:38+05:30
అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని కొండలింగాలవలస పంచాయతీ చల్లవానివలస గ్రామానికి చెందిన వివాహిత ఉయ్యాల దేవి(24) గురువారం తీవ్ర మైన కడు పునొప్పికి గురయ్యారు
మెంటాడ, సెప్టెంబరు 22: అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని కొండలింగాలవలస పంచాయతీ చల్లవానివలస గ్రామానికి చెందిన వివాహిత ఉయ్యాల దేవి(24) గురువారం తీవ్ర మైన కడు పునొప్పికి గురయ్యారు. గుర్తించిన కుటుంబ సభ్యులు ఇంట్లో సపర్యలు చేసినప్పటికీ నయంకాలేదు. దీంతో చల్లపేట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాఽథమిక చికిత్స చేసిన అనంతరం గజపతినగరం కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి దేవి మృతి చెందారు. అయితే మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధపడగా వైద్యులు నిరాకరించారు. కుటుంబ సభ్యులు చెప్పిన మాటల్లో పొంతన లేకపోవడంతో వైద్యు లకు అనుమానం కలిగి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగిస్తామని స్పష్టంచేశారు. శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి తర్వాత కుటుంబ స భ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతురాలు దేవికి శివయ్య, ఒక కుమారు డు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదే మండలం జీటీపేట పంచాయతీ పనుకువ లసకు చెందిన మృతురాలి తల్లి గొర్లె ఎరకమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఆండ్ర పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-09-23T00:11:38+05:30 IST