ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సర్వే నంబర్లు బ్లాక్‌!

ABN, First Publish Date - 2023-09-06T00:46:27+05:30

ఇతని పేరు సారిపల్లి సూరిబాబు. శృంగవరపుకోట మండలం ధర్మవరం. గత ఏడాది అక్టోబర్‌లో గ్రామ సచివాలయం నుంచి పొందిన 1బీలో ఎనిమిది సర్వే నెంబర్‌లలో 2.66 ఎకరాల విస్తీర్ణం ఉండేది. తాజాగా సోమవారం పొందిన 1బీలో ఆరు సర్వే నెంబర్‌లలో 1.83 ఎకరాల విస్తీర్ణమే కనిపిస్తోంది. రెండు సర్వే నెంబర్‌లలోని 0.83 ఎకరాల విస్తీర్ణం వివరాలు లేవు. ఈ విషయమై తహసీల్దార్‌ కార్యాలయంలో సంప్రదించగా సరైన సమాధానం రాలేదు. చేసేదిలేక భార్య, దివ్యాంగుడైన కుమారునితో కలసి రాత్రి వరకు నిరసన తెలిపాడు.

సర్వే నంబర్లు బ్లాక్‌!

వెబ్‌ల్యాండ్‌లో కనిపించకుండా చేస్తున్న రెవెన్యూ

అడిగితే బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరికలు

ఈ ప్రభుత్వం వచ్చాక పెరిగిన ఈ తరహా దారుణాలు

అధికార పార్టీ నేతలకు సహకారంగా అధికారులు

- ఇతని పేరు సారిపల్లి సూరిబాబు. శృంగవరపుకోట మండలం ధర్మవరం. గత ఏడాది అక్టోబర్‌లో గ్రామ సచివాలయం నుంచి పొందిన 1బీలో ఎనిమిది సర్వే నెంబర్‌లలో 2.66 ఎకరాల విస్తీర్ణం ఉండేది. తాజాగా సోమవారం పొందిన 1బీలో ఆరు సర్వే నెంబర్‌లలో 1.83 ఎకరాల విస్తీర్ణమే కనిపిస్తోంది. రెండు సర్వే నెంబర్‌లలోని 0.83 ఎకరాల విస్తీర్ణం వివరాలు లేవు. ఈ విషయమై తహసీల్దార్‌ కార్యాలయంలో సంప్రదించగా సరైన సమాధానం రాలేదు. చేసేదిలేక భార్య, దివ్యాంగుడైన కుమారునితో కలసి రాత్రి వరకు నిరసన తెలిపాడు. కుటుంబ వివాదం ఉండడంతో జాయింట్‌ కలెక్టర్‌ ఈ రెండు సర్వే నెంబర్‌లను బ్లాక్‌ చేశారని రెవెన్యూ అధికారులు చివరిగా సమాధానం ఇచ్చారు. ఎప్పుడో ఐదు దశబ్దాల క్రితం పంచుకుని ఎవరికి వారం సాగు చేసుకుంటున్న భూములకు ఇప్పుడు వివాదమేంటని బాధత రైతు కుటుంబం ప్రశ్నిస్తోంది.

శృంగవరపుకోట, సెప్టెంబరు 5:

జిల్లాలో భూ సంబంధిత వివాదాలు పెరుగుతుండడం ఒకెత్తయితే వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు మారిపోవడం.. పూర్తిగా కనిపించకుండా పోవడం... విస్తీర్ణం తగ్గి చూపించడం ఇటీవల కాలంలో పెరుగుతోంది. దీనివల్ల అనేక రైతు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రతి సోమవారం జరిగే స్పందనకు ఇలాంటి ఫిర్యాదులు కోకొల్లలుగా అందుతున్నాయి. జగనన్నకు చెబుదాంలోనూ నమోదవుతున్నాయి. వెబ్‌ల్యాండ్‌లో ఈ రోజు కనిపిస్తున్న సర్వే నెంబర్‌లు రేపటికి మాయమవుతున్నాయి. ఎందుకు కనిపించడం లేదో అర్థం కాక తహసీల్దార్‌ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ అధికారుల నుంచి సరైన సమాధానం ఉండడం లేదు. గట్టిగా నిలదీసి అడిగితే క్రిమినల్‌ కేసులు పెడతామంటూ తిరిగి వీరినే హెచ్చరిస్తున్నారు.

జిల్లాలో అత్యధిక గ్రామాల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ప్రతిపక్షం ప్రజాప్రతినిధులు ఉన్న గ్రామాల్లో కూడా అధికార పార్టీ నాయకుల మాటకే విలువ ఉంది. దీంతో తమకు అనుకూలంగా లేని రైతు కుటుంబాలను వేధించేందుకు అన్నదమ్ముల మధ్య తగువులు సృష్టిస్తున్నారు. ఇద్దరిలో ఒకరిని చేరదీసి భూతగాదాలు పెడుతున్నారు. తమకు పడని రైతు కుటుంబాలకు చెందిన భూములపై ఫిర్యాదులు చేయిస్తున్నారు. అనుకూలంగా వున్న రెవెన్యూ అధికారులతో చెప్పి వెబ్‌ల్యాండ్‌లో వున్న సర్వే నెంబర్‌లను బ్లాక్‌లో పెట్టిస్తున్నారు. నిబంధనలను అనుసరించకుండా కొంత మంది రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలు చెప్పిన మాట విని రైతు కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు.

- రెండు దశాబ్దాల నుంచి జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంది. భూముల ధరలు వీపరితంగా పెరిగాయి. దీంతో ఇప్పుడు కొండలు, గుట్టల సమీపంలో వున్న భూములు కూడా సెంటు రూ.50 వేల వరకు పలుకుతోంది. అంటే ఎకరం రూ.50లక్షల విలువ చేస్తుంది. ఇక ప్రధాన రహదారులకు ఆనుకుని వున్న భూములు రూ.కోట్లలో అమ్ముడవుతున్నాయి. దీంతో పొలం సరిహద్దున వున్న పక్క రైతు గట్టు ఎగవేత సమయంలో కూడా తమ వైపు చొచ్చుకురాకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

వెబ్‌ల్యాండ్‌లో ఉంటేనే హక్కులు

జిల్లాలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. తాత,తండ్రుల నుంచి వచ్చిన భూములను పంచుకొని చేసుకుంటున్న రైతులు అధికం. రైతుల సౌలభ్యం కోసం ప్రభుత్వం 2011లో వెబ్‌ల్యాండ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత భూమి రికార్డులన్నీ ఆన్‌లైన్‌ చేశారు. ఇలా వెబ్‌ల్యాండ్‌లో వున్న భూములకు మాత్రమే క్రయ, విక్రయాలకు అనుమతి వుంది. దీంతో రైతులు భూములన్నింటినీ వెబ్‌ల్యాండ్‌లో నమోదుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు దాదాపు 90శాతం భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదయ్యాయి. మిగిలిన భూములు వివాదాల కారణంగా ఆన్‌లైన్‌లో లేవు. ఆన్‌లైన్‌లో కనిపించిన భూమిలపైనే రైతులకు హక్కులు వుంటాయి.

బ్లాక్‌ చేస్తున్నారెందుకో!

వెబ్‌ల్యాండ్‌ల్లో వున్న భూములపై ఫిర్యాదులున్నాయంటూ రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్‌లు కనిపించకుండా బ్లాక్‌ చేస్తున్నారు. సాగుపైనే దృష్టి సారించే రైతులకు ఇవేమీ తెలియక వ్యవసాయ రుణం, ఇతర అవసరాలకు 1బీని తీసుకున్నప్పుడు ఈ విషయం బయటపడుతోంది. వీఆర్వో వద్దకు వెళ్తే తహసీల్దార్‌ను అడగాలని, అక్కడడిగితే ఆర్డీవో, జేసీలను కలవండంటూ నిర్లక్ష్యంగా బదులిస్తున్నారు. తాత, ముత్తాతల నుంచి సాగు చేస్తున్న భూమిని వివాదాస్పదం చేస్తుండడంతో మానసిక వేదనతో కొంత మంది అనార్యోగం పాలవుతున్నారు.

- సహజంగా ఏ రైతు భూమిని అమ్మేందుకు ఇష్టపడరు. అయితే వీరి పక్క భూములను కొనుగోలు చేసిన స్థిరాస్థి వ్యాపారులు, భూమి పంపకంలో వాటా పొందిన వారు పక్క రైతులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి ఎక్కడక్కడ అధికార పార్టీకి చెందిన స్థానిక వైసీపీ నేతలు సహకారం అందిస్తున్నారు. వీరి సూచనలతో యంత్రాంగం వెబ్‌ల్యాండ్‌లోని సర్వే నెంబర్‌లు కనిపించకుండా చేస్తున్నారు. భూమి చేతిలో వున్నప్పటికీ తారుమారవుతున్న రికార్డులను కాపాడుకోలేక స్థిరాస్తి వ్యాపారులు, డబ్బున్నవారు అడిగిన ధరకు భూమిని వదులుకోక తప్పడం లేదు.

- కోర్టులో వివాదాలు నడుస్తున్న భూముల క్రయవిక్రయాలు జరపకుండా వెబ్‌ల్యాండ్‌ నుంచి సర్వే నెంబర్‌లను తొలగిస్తారు. ఈ విషయం బాధిత రైతులకు అధికారులు చెప్పాలి. అస్తి పంపకాలు, తగాదాలు పడుతున్న కుటుంబాలు తగిన ఆధారాలతో చేసిన ఫిర్యాదుల మేరకు తహసీల్దార్‌లు జాయింట్‌ కలెక్టర్‌లకు నివేదిస్తారు. సరైన కారణం వున్నట్లు గుర్తించిన జేసీ వెబ్‌ల్యాండ్‌లో వివాదాస్పద సర్వే నెంబర్‌లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇలాంటి కారణాలేవి లేకుండానే వెబ్‌ల్యాండ్‌లో సర్వే నెంబర్‌లు కనిపించకుండా చేస్తున్న సంఘటనలు బయటపడు తున్నాయి. రాజకీయం, అంగబలం వున్న వ్యక్తులదని తెలిస్తే వెంటనే వెబ్‌ల్యాండ్‌లో సర్వేనెంబర్‌లు దర్శనమిస్తున్నాయి. ఎటువంటి అధికారం లేనివారిని మాత్రం తిరిగి బెదిరింపులకు గురిచేస్తున్నారు. కార్యాలయాల నుంచి బయటకు వెళ్లాలని గద్దిస్తున్నారు.

--------

Updated Date - 2023-09-06T00:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising