ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-06-03T00:26:22+05:30

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగేళ్లు అయినా అప్ప టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం శోచనీయమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటాలు ఆగవని ఏపీ జీఈఏ జిల్లా అధ్యక్షు డు పి.రామచంద్రరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం: వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగేళ్లు అయినా అప్ప టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం శోచనీయమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటాలు ఆగవని ఏపీ జీఈఏ జిల్లా అధ్యక్షు డు పి.రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని ఎప్పటికప్పుడు డీఏ ఇస్తామన్న జగన్‌ నాలుగేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. 1వ తేదీకి జీతాలు పడక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 11వ పీఆర్సీ అమల్లో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా ఆర్థిక పరమైన బకాయిలను డీఏ ఏరియర్స్‌ను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ములకు భద్రత కల్పించాలన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్‌ రోజునే ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలన్నారు. అన్ని శాఖల్లో డీఎస్పీ ద్వారా నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు లకు సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం పూర్వ అధ్యక్షుడు వేణుగోపాల్‌, ఏపీజీఈఏ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంది వెంకటరమణ, తాలూకా అధ్యక్షుడు సుధాకర్‌ పట్నా యక్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఏ బాషా, గౌరవ అధ్యక్షుడు బి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:26:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising